రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి ఫైర్.. రాహుల్ హాస్యాస్పదంగా వ్యవహరించారన్న హర్దీప్ సింగ్ పూరి
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి ఫైర్ అయ్యారు. రక్షణ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ సమావేశం నుంచి రాహుల్ బయటికి వెళ్లడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి ఫైర్ అయ్యారు. రక్షణ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ సమావేశం నుంచి రాహుల్ బయటికి వెళ్లడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ”1971లో పాకిస్థాన్ పైన భారత సైన్యం సాధించిన విజయంపై సైనికులకు సంఘీభావం తెలిపి, అమరులకు శ్రద్ధాంజలి ఘటించాల్సింది పోయి.. రక్షణ వ్యవహారాల పార్లమెంటరీ ప్యానెల్ మీటింగ్ నుంచి బయటికెళ్లి రాహుల్ హాస్యాస్పదంగా వ్యవహరించారని హర్దీప్ సింగ్ పూరి అన్నారు. అయితే జాతీయ భద్రతపై చర్చించకుండా సైనిక బలగాల యూనిఫామ్‌పై చర్చిస్తూ ప్యానెల్ సమయాన్ని వృధా చేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది.ఈ నేపథ్యంలోనే రాహుల్ సహా కాంగ్రెస్ నేతలు సమావేశం నుంచి బయటికి వెళ్లిపోయారు.