తప్పుడు లెక్కలు.. 15 రాష్ట్రాల్లో 336 చోట్ల దాడులు

తప్పుడు లెక్కలు.. 15 రాష్ట్రాల్లో 336 చోట్ల దాడులు

తప్పుడు ఇన్‌వాయిస్ బిల్లులను పెట్టి.. జీఎస్టీ రిఫండ్‌లను పొందిన పలు సంస్థలపై డైరక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్సీ (డీజీజీఐ), డైరక్టరేట్ జనరల్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ)లు కలిసి దేశవ్యాప్తంగా సంయుక్త తనిఖీలు నిర్వహించాయి. కొందరు ఎగుమతిదారులు తప్పుడు పద్ధతుల్లో జీఎస్‌టీ రిఫండ్‌ను కోరుతున్న నేపథ్యంలో ఈ తనిఖీలు నిర్వహించినట్లు తెలుస్తోంది. తెలంగాణ సహా మొత్తం 15 రాష్ట్రాల్లో 336చోట్ల ఏకకాలంలో దాడులు జరిపారు. గురువారం జరిగిన ఈ తనిఖీల్లో మొత్తం 1200 మంది అధికారులు […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Sep 13, 2019 | 8:20 AM

తప్పుడు ఇన్‌వాయిస్ బిల్లులను పెట్టి.. జీఎస్టీ రిఫండ్‌లను పొందిన పలు సంస్థలపై డైరక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్సీ (డీజీజీఐ), డైరక్టరేట్ జనరల్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ)లు కలిసి దేశవ్యాప్తంగా సంయుక్త తనిఖీలు నిర్వహించాయి. కొందరు ఎగుమతిదారులు తప్పుడు పద్ధతుల్లో జీఎస్‌టీ రిఫండ్‌ను కోరుతున్న నేపథ్యంలో ఈ తనిఖీలు నిర్వహించినట్లు తెలుస్తోంది.

తెలంగాణ సహా మొత్తం 15 రాష్ట్రాల్లో 336చోట్ల ఏకకాలంలో దాడులు జరిపారు. గురువారం జరిగిన ఈ తనిఖీల్లో మొత్తం 1200 మంది అధికారులు పాల్గొన్నారు. ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ) పొందేందుకు అర్హత లేని, నకిలీ సరఫరాలతో కొందరు ఎగుమతులు చేసినట్లు గుర్తించారు. కొందరు వ్యాపారులు రూ.3500 కోట్ల విలువైన ఇన్‌వాయిస్‌లపై రూ.470 కోట్లు అక్రమంగా ఐటీసీ రూపేణ వీరు పొందినట్లు ప్రాథమిక పరిశీలనలో గుర్తించారు. ఎగుమతిదార్లు మళ్లీ వీటినే ఆధారంగా చూపి, ఐటీసీ రూపంలో ఐజీఎస్‌టీ చెల్లించినట్లు చూపి, రిఫండ్‌ కూడా సాధించారు. ఇక తెలంగాణలో కూడా ఈ తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, బేగంబజార్‌ ప్రాంతాల్లో ముగ్గురు మొబైల్‌ డీలర్లకు చెందిన 8 కార్యాలయాలపై దాడులు జరిగాయి. కాగా, సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇన్‌డైరెక్ట్‌ టాక్సెస్‌ అండ్‌ కస్టమ్స్‌ (సీబీఐసీ) విభాగాలు రెండూ సంయుక్తంగా ఇంత భారీఎత్తున తనిఖీలు చేయడం ఇదే తొలిసారి.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu