నేడు జీఎస్టీ 38వ భేటీ.. కీలక చర్చలు వీటిపైనే!

నేడు జీఎస్టీ 38వ సమావేశం ఢిల్లీలో జరగనుంది. మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. దేశవ్యాప్తంగా ఊహించిన దానికన్నా తక్కువ స్థాయిలో జీఎస్టీ వసూళ్లు రావడం, రాష్ట్రాలకు నష్టపరిహారాల చెల్లింపులో ఆలస్యం.. వీటికి గల కారణాలపై సమీక్షించేందుకు జీఎస్టీ మండలి నేడు సమావేశం కానుంది. వివిధ వస్తువులపై జీఎస్టీ వడ్డింపు అలాగే ఆదాయాన్ని పెంచేందుకు అనుసరించాల్సిన విధానాలపై సూచనలు, సలహాలు చేయాల్సిందిగా.. ఇప్పటికే అన్ని రాష్ట్రాలను […]

నేడు జీఎస్టీ 38వ భేటీ.. కీలక చర్చలు వీటిపైనే!
Follow us

| Edited By:

Updated on: Dec 18, 2019 | 9:55 AM

నేడు జీఎస్టీ 38వ సమావేశం ఢిల్లీలో జరగనుంది. మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. దేశవ్యాప్తంగా ఊహించిన దానికన్నా తక్కువ స్థాయిలో జీఎస్టీ వసూళ్లు రావడం, రాష్ట్రాలకు నష్టపరిహారాల చెల్లింపులో ఆలస్యం.. వీటికి గల కారణాలపై సమీక్షించేందుకు జీఎస్టీ మండలి నేడు సమావేశం కానుంది. వివిధ వస్తువులపై జీఎస్టీ వడ్డింపు అలాగే ఆదాయాన్ని పెంచేందుకు అనుసరించాల్సిన విధానాలపై సూచనలు, సలహాలు చేయాల్సిందిగా.. ఇప్పటికే అన్ని రాష్ట్రాలను కోరింది కేంద్ర ఆర్థిక శాఖ. ముఖ్యంగా వీటిపైనే చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే.. జీఎస్టీ వసూళ్ల క్షీణతపై ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎక్కువగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

అయితే.. దేశంలో ఆర్థిక మందగమన పరిస్థితులు నెలకొన్న సందర్భంగా.. మరలా కొత్తగా ఎలాంటి పన్నులు, సుంకాలు విధించకూడదంటూ బెంగాల్ సహా పలు రాష్ట్రాలు ఇప్పటికే జీఎస్టీ కౌన్సిల్‌కు లేఖ కూడా రాశారు. కాగా.. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. తెలంగాణకు జీఎస్టీలో రావాల్సిన నష్టపరిహారాన్ని, జీఎస్టీ నిధుల మళ్లింపు అంశాన్ని మంత్రి హరీష్ రావు లేవనెత్తే అవకాశముంది.