సీనియర్లను కావాలనే తప్పించారు.. జట్టు యాజమాన్యంపై యూవీ ఫైర్!
టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ జట్టు యాజమాన్యంపై తీవ్ర విమర్శలు గుప్పించాడు. ఇంగ్లాండ్‌లో జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో భారత్ ఓడిపోవడానికి బీసీసీఐ, జట్టు యాజమాన్యం ప్రణాళికలే కారణాలని స్పష్టం చేశాడు. ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ తొందరగా పెవిలియన్‌కు చేరినప్పుడు జట్టును విజయతీరాలకు చేర్చడానికి మిడిల్ ఆర్డర్‌లో అనుభవం ఉన్న ఆటగాళ్లు ఎంతో అవసరం. అయితే యాజమాన్యం మాత్రం వారిని తీసుకోకుండా అనుభవం లేని ప్లేయర్స్‌ను మిడిల్ ఆర్డర్‌లో చోటు ఇచ్చిందని.. ఇక అదే భారత్ పరాజయం పాలవ్వడానికి […]

టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ జట్టు యాజమాన్యంపై తీవ్ర విమర్శలు గుప్పించాడు. ఇంగ్లాండ్‌లో జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో భారత్ ఓడిపోవడానికి బీసీసీఐ, జట్టు యాజమాన్యం ప్రణాళికలే కారణాలని స్పష్టం చేశాడు. ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ తొందరగా పెవిలియన్‌కు చేరినప్పుడు జట్టును విజయతీరాలకు చేర్చడానికి మిడిల్ ఆర్డర్‌లో అనుభవం ఉన్న ఆటగాళ్లు ఎంతో అవసరం. అయితే యాజమాన్యం మాత్రం వారిని తీసుకోకుండా అనుభవం లేని ప్లేయర్స్‌ను మిడిల్ ఆర్డర్‌లో చోటు ఇచ్చిందని.. ఇక అదే భారత్ పరాజయం పాలవ్వడానికి ముఖ్య కారణమైందన్నాడు. ఈ మేరకు తాజాగా ఆయన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు.
వన్డే ప్రపంచకప్ వంటి మెగా టోర్నమెంట్స్‌లో ఎప్పుడూ కూడా జట్టు పటిష్టంగా ఉండాలి. అంతేకాక టాప్ ఆర్డర్‌ను అనుగుణంగా మిడిల్ ఆర్డర్‌లో సీనియర్ బ్యాట్స్‌మెన్ ఖచ్చితంగా ఉండాలి. అలాంటిది విజయ్ శంకర్, రిషబ్ పంత్ వంటి అనుభవం లేని ప్లేయర్స్‌ను ఎంపిక చేయడమేంటని ప్రశ్నించాడు. మరోవైపు అంబటి రాయుడు విషయంలో కూడా బీసీసీఐ అవలంభించిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. సీనియర్ ప్లేయర్లను బీసీసీఐ కావాలనే తప్పిస్తోందన్నట్లు యూవీ ఇన్‌డైరెక్ట్‌గా బీసీసీఐను విమర్శించాడు.
అయితే విజయ్ శంకర్, రిషబ్ పంత్ వంటి ప్లేయర్స్ అత్యుత్తమ ఆటగాళ్లు కాదని చెప్పట్లేదు. మెగా టోర్నీల్లో ఒత్తిడికి తగ్గట్టుగా ఆడే అనుభవం ఇంకా వారిలో లేదు. తక్కువ అనుభవం ఉన్న వారి నుంచి మంచి ప్రదర్శన రావాలని కోరుకోవడం కూడా సరైనది కాదు. అటు ఫైనల్‌లో జట్టు గడ్డు పరిస్థితిలో ఉన్నప్పుడు ధోనిని లేట్‌గా పంపించడం కూడా చెత్త ఐడియా అని యూవీ మండిపడ్డాడు. నిజంగా ఆ సమయంలో జట్టు యాజమాన్యం సరైన ప్రణాళికలను సిద్ధం చేసుకుని ఉంటే వన్డే ప్రపంచకప్ విజేతగా భారత్ నిలిచేదని అభిప్రాయపడ్డాడు. కాగా, హర్భజన్ సింగ్ కూడా టీమిండియాలో జరుగుతున్న అంతర్గత రాజకీయాలపై వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.