ఏపీలో టూరిజం అభివృద్ధి.. ఫైవ్ స్టార్ హోటళ్లకు పునాది.?
ఏపీలో టూరిజాన్ని అభివృద్ధి చేయడానికి జగన్ సర్కార్ ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే పలు నగరాల్లో ఫైవ్ స్టార్ హోటళ్లను నిర్మించాలని చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పబ్లిక్, ప్రైవేట్ కంపెనీల భాగస్వామ్యంతో వీటిని నిర్మించాలని ఇప్పటికే టూరిజం శాఖ ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ అంశంపై టెండర్ల ప్రక్రియను త్వరలోనే శ్రీకారం చుట్టనున్నారు. విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో వీటిని నిర్మించేందుకు సన్నాహాలు […]

ఏపీలో టూరిజాన్ని అభివృద్ధి చేయడానికి జగన్ సర్కార్ ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే పలు నగరాల్లో ఫైవ్ స్టార్ హోటళ్లను నిర్మించాలని చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పబ్లిక్, ప్రైవేట్ కంపెనీల భాగస్వామ్యంతో వీటిని నిర్మించాలని ఇప్పటికే టూరిజం శాఖ ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ అంశంపై టెండర్ల ప్రక్రియను త్వరలోనే శ్రీకారం చుట్టనున్నారు. విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో వీటిని నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా ఈ 8 నగరాల్లో సుమారు 774 ఎకరాలను ఇప్పటికే గుర్తించినట్లు తెలుస్తోంది.
అటు వైఎస్ జగన్.. మంగళవారం శాసనసభలో ఏపీ రాజధాని విషయంపై ఓ క్లారిటీ ఇచ్చారు. దక్షిణాఫ్రికా తరహాలో ఏపీకి కూడా మూడు రాజధానులు ఉండొచ్చని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న అమరావతిని లెజిస్లేచర్ రాజధానిగా కొనసాగిస్తామని హింట్ ఇచ్చిన ఆయన విశాఖలో బ్రహ్మాండమైన మౌలిక వసతులు వున్న విషయాన్ని గుర్తు చేస్తూ.. అక్కడ అడ్మినిస్ట్రేటివ్ కేపిటల్ ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని చెప్పారు. అదే విధంగా జ్యూడిషియరీ కేపిటల్‌గా కర్నూలు నగరాన్ని గుర్తించే అవకాశాలున్నాయన్నారు సీఎం జగన్.




