AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పౌరసత్వ చట్టంపై స్టే కు సుప్రీంకోర్టు తిరస్కృతి

వివాదాస్పదమైన పౌరసత్వ చట్ట సవరణను సవాలు చేస్తూ దాఖలైన 60 పిటిషన్లపై సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. సీజేఐ ఎస్.ఎ. బాబ్డే ఆధ్వర్యాన గల ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం బుధవారం ఉదయం కొద్దిసేపు ఈ పిటిషన్లపై విచారణ జరిపింది. ఈ చట్టం అమలుపై స్టే జారీ చేసేందుకు ధర్మాసనం నిరాకరించింది. దీనిపై స్టే ఇవ్వవచ్చా లేదా అన్నవిషయాన్ని తాము పరిశీలించాల్సి ఉందని న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఇందులోని చెల్లుబాటును అధ్యయనం చేయాల్సి ఉందని వారు అభిప్రాయపడ్డారు. జస్టిస్ […]

పౌరసత్వ చట్టంపై స్టే కు సుప్రీంకోర్టు తిరస్కృతి
Anil kumar poka
|

Updated on: Dec 18, 2019 | 1:24 PM

Share

వివాదాస్పదమైన పౌరసత్వ చట్ట సవరణను సవాలు చేస్తూ దాఖలైన 60 పిటిషన్లపై సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. సీజేఐ ఎస్.ఎ. బాబ్డే ఆధ్వర్యాన గల ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం బుధవారం ఉదయం కొద్దిసేపు ఈ పిటిషన్లపై విచారణ జరిపింది. ఈ చట్టం అమలుపై స్టే జారీ చేసేందుకు ధర్మాసనం నిరాకరించింది. దీనిపై స్టే ఇవ్వవచ్చా లేదా అన్నవిషయాన్ని తాము పరిశీలించాల్సి ఉందని న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఇందులోని చెల్లుబాటును అధ్యయనం చేయాల్సి ఉందని వారు అభిప్రాయపడ్డారు. జస్టిస్ బీ.ఆర్.గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ లతో కూడిన బెంచ్ ఈ పిటిషన్లపై తదుపరి విచారణ వచ్ఛే జనవరి 22 న జరగాలని ఆదేశించింది.

అటు-ఈ చట్టంపై దేశవ్యాప్త హింసాత్మక నిరసనలు పెల్లుబుకుతున్నప్పటికీ.. మోదీ ప్రభుత్వం వెనుకంజ వేసే ప్రసక్తి లేదని హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఏది అడ్డు వచ్చినా శరణార్థులుగా వచ్ఛే వారికి ఈ దేశ పౌరసత్వం లభిస్తుందని, వారు గౌరవప్రదమైన భారతీయులుగా నివసిస్తారని ఆయన చెప్పారు. ఢిల్లీ లోని ద్వారకలో జరిగిన ఓ ర్యాలీలో మాట్లాడిన ఆయన .. ఈ చట్టానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా జరుగుతున్న నిరసన ప్రదర్శనలను తేలిగ్గా కొట్టిపారేశారు. ఈ నూతన చట్టాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ తో బాటు పలు ప్రతిపక్షాలు, సివిల్ సొసైటీ సభ్యులు, సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బీజేపీకి మిత్ర పక్షమైన అసోం గణ పరిషద్ సైతం దీన్ని సవాలు చేస్తూ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ వేసింది. ఢిల్లీ, అసోం తదితర రాష్ట్రాల్లోఈ చట్టంపై పెద్దఎత్తున ఆందోళనలు కొనసాగుతున్న సంగతి విదితమే. ఈ పిటిషన్లపై విచారణ జరగాలంటే మొదట దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొనాలని, అల్లర్లు, ఘర్షణలు నిలిచిపోవాలని సీజేఐ బాబ్డే ఇటీవలే పేర్కొన్నారు కూడా.. వీటిపై కూలంకష విచారణ జరగాలని ఆయన అన్నారు.