రేపు జీఎస్టీ సమావేశం..

జీఎస్టీ పాలక మండలి సోమవారం మరోసారి భేటీ కానుంది. జీఎస్టీ వసూల్లు తగ్గడం వల్ల తలెత్తిన లోటును భర్తీ చేసేందుకు రాష్ట్రాలకు చెల్లించాల్సిన పరిహారం అంశమే ప్రధాన అజెండాగా 43వ కౌన్సిల్ సమావేశం జరగనుంది.

రేపు జీఎస్టీ సమావేశం..
Follow us

|

Updated on: Oct 11, 2020 | 8:18 PM

GST Council Meeting : జీఎస్టీ పాలక మండలి సోమవారం మరోసారి భేటీ కానుంది. జీఎస్టీ వసూల్లు తగ్గడం వల్ల తలెత్తిన లోటును భర్తీ చేసేందుకు రాష్ట్రాలకు చెల్లించాల్సిన పరిహారం అంశమే ప్రధాన అజెండాగా 43వ కౌన్సిల్ సమావేశం జరగనుంది. గత సమావేశంలో దీనిపై చర్చించినప్పటికీ ఎలాంటి ఏకాభిప్రాయం కుదరకపోవడంతో కౌన్సిల్ మరోసారి సమావేశం కానున్నారు.

పరిహారం చెల్లింపునకు సంబంధించి రాష్ట్రాల ముందు కేంద్రం ఉంచిన రెండు ఐచ్ఛికాల్లో 21 రాష్ట్రాలు ఒక ఐచ్ఛికాన్ని ఎంచుకోగా, కొన్ని రాష్ట్రాలు ఎలాంటి ఆప్షన్‌ను ఎంచుకోలేదు. కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాలు, కొన్ని రాష్ట్రాలు కేంద్రం ఇచ్చిన రెండు ఐచ్ఛికాల్లో ఒదాన్ని ఎంపిక చేసుకున్నాయి.

కానీ ఇతర రాష్ట్రాలు మాత్రం ఏ అంశాన్ని ఎంచుకోలేదు. పరిహారం చెల్లింపులకు సంబంధించి ఓ మెకానిజం రూపొందించేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు కానుంది. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరగబోయే సమాశం వాడివేడిగా జరిగే అవకాశం ఉంది.