AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్యో పాపం కొత్త పెళ్లి కొడుకు.. మొదటి రాత్రి భార్యను చూసి పరుగో పరుగు..!

సోషల్ మీడియా వేదికగా ఒక వింత సంఘటన వేగంగా వైరల్‌ అవుతోంది. అందులో ఒక కొత్త పెళ్లి కొడుక్కి ఎవరూ ఊహించని కష్టం వచ్చింది. అతడి కష్టం తెలిసిన ప్రతి ఒక్కరూ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. పాపం, ఆ పెళ్లి ఆ కొడుకు పెళ్లయిన కొన్ని గంటల్లోనే, శోభనం రోజునే తనకు విడాకులు కావాలంటూ పట్టుబట్టాడు. అసలు ఇంతకీ ఏం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళితే...

అయ్యో పాపం కొత్త పెళ్లి కొడుకు.. మొదటి రాత్రి భార్యను చూసి పరుగో పరుగు..!
bride without makeup viral story
Jyothi Gadda
|

Updated on: May 20, 2026 | 5:03 PM

Share

సమకాలీన సమాజంలో విడాకులు తీసుకోవడానికి రకరకాల కారణాలు వింటూ ఉంటాం. కానీ, టర్కీలో వెలుగుచూసిన ఒక వింత, ఆశ్చర్యకరమైన ఘటన సోషల్ మీడియా వేదికగా నెటిజన్లను ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. టర్కీకి చెందిన ఒక యువతీ యువకుడికి పెద్దలు ఘనంగా వివాహం జరిపించారు. నిశ్చితార్థం, పెళ్లి వేడుకల సమయంలో సదరు వధువు భారీగా మేకప్ వేసుకుని ఎంతో అందంగా కనిపించింది. అయితే పెళ్లి వేడుకలన్నీ ముగిసి, రాత్రి గదిలోకి వెళ్లిన తర్వాత వధువు తన ముఖానికి ఉన్న మేకప్‌ను పూర్తిగా తొలగించింది. ఆ తర్వాత గదిలోకి వచ్చిన వరుడు, మేకప్ లేని ఆమె ముఖాన్ని చూసి ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు. తాను పెళ్లి చేసుకున్న అమ్మాయి ఈమె కాదని భ్రమపడేంతగా ఆమె రూపం మారిపోవడంతో అతను తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాడు.

మోసపోయానంటూ కోర్టుకు:

మేకప్ లేకుండా ఉన్న తన భార్యను చూసి, తాను తీవ్రంగా మోసపోయానని (Deceived) గ్రహించాడు. పెళ్లికి ముందు ఆమె తన అసలు రూపాన్ని దాచిపెట్టి, కేవలం కాస్మెటిక్స్, మేకప్ ట్రిక్స్‌తో తనను నమ్మించిందని ఆరోపించాడు. ఆమె అసలు రూపం తెలిస్తే తాను ఈ పెళ్లి చేసుకునేవాడిని కానని పేర్కొంటూ, వివాహమైన మొదటి రాత్రే విడాకులు కావాలంటూ పట్టుబట్టాడు. ఈ క్రమంలోనే చట్టపరంగా విడాకుల కోసం కోర్టును కూడా ఆశ్రయించాడు.

ఇవి కూడా చదవండి

ఈ వింత కథనం సామాజిక మాధ్యమాలలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కేవలం బాహ్య సౌందర్యాన్ని, మేకప్‌ను చూసి పెళ్లి చేసుకోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు వస్తాయని కొందరు అంటుంటే.. ముఖంపై ఉండే రంగులను చూసి జీవిత భాగస్వామిని దూరం చేసుకోవడం మూర్ఖత్వమని మరికొందరు విమర్శిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, ఈ మేకప్ విడాకుల ఉదంతం ప్రస్తుతం నెట్ ఇంట హాట్ టాపిక్‌గా మారింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us