AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Peddi Movie: ‘పెద్ది’ ట్రైలర్ మైండ్ బ్లోయింగ్.. రామ్ చరణ్ ప్రాణం పెట్టాడు.. స్టార్ డైరెక్టర్ ప్రశంసలు

రామ్ చరణ్ 'పెద్ది' సినిమా ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ముఖ్యంగా యూట్యూబ్ లో దీనికి మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి. సెలబ్రిటీలు సైతం పెద్ది ట్రైలర్ ను చూసి ఫిదా అవుతున్నారు. తాజాగా ఓ స్టార్ డైరెక్టర్ రామ్ చరణ్ మూవీ ట్రైలర్ పై ప్రశంసలు కురిపించాడు.

Peddi Movie: 'పెద్ది' ట్రైలర్ మైండ్ బ్లోయింగ్.. రామ్ చరణ్ ప్రాణం పెట్టాడు.. స్టార్ డైరెక్టర్ ప్రశంసలు
Peddi Movie
Basha Shek
|

Updated on: May 20, 2026 | 4:28 PM

Share

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ సినిమా పెద్ది. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తోన్న ఈ సినిమా జూన్ 04న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా మే 18న ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. అయితే రిలీజైన కొన్ని గంటల్లో పెద్ది ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేసింది. ముఖ్యంగా యూట్యూబ్ లో ఊహించని స్థాయిలో వ్యూస్, లైక్స్ సాధిస్తూ దూసుకెళ్తోంది. ట్రైలర్ విడుదలైన తొలి 24 గంటల్లోనే 101 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. తద్వారా ఈ ఫీట్‌ను అత్యంత వేగంగా అందుకున్న తెలుగు ట్రైలర్‌గా ‘పెద్ది’ ట్రైలర్ కొత్త రికార్డ్ సృష్టించింది. తెలుగులోనే కాదు ప్రస్తుతం పలు భాషల్లో నూ యూట్యూబ్‌లో నెంబర్ వన్ స్థానంలో ట్రెండింగ్‌లో ఉంది పెద్ది ట్రైలర్. మరోవైపు స్టార్ హీరోలు, డైరెక్టర్లు సైతం పెద్ది సినిమా ట్రైలర్ పై స్పందిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. తాజాగా స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి పెద్ది ట్రైలర్ పై స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్ (ఎక్స్)లో పెద్ది ట్రైలర్ ను షేర్ చేసిన ఆయన

‘పెద్ది’ ట్రైలర్ పూర్తిగా అద్భుతంగా, మైండ్ బ్లోయింగ్ గా ఉంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ గారు ఈ పాత్ర కోసం తన హృదయాన్ని, ప్రాణాన్ని పెట్టేశారు. ఆయన చూపించిన ఇంటెన్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ నిజంగా శ్వాస ఆగిపోయేలా ఉంది. ఈ చిత్రం ద్వారా ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న వెంకట సతీష్ కిలారు గారికి నా హృదయపూర్వక అభినందనలు. అలాగే డైరెక్టర్ బుచ్చిబాబు, చిత్ర యూనిట్ మొత్తానికి నా బెస్ట్ విషెస్’ అని రాసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

అనిల్ రావి పూడి ట్వీట్..

అంతకుముందు కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి కూడా పెద్ది ట్రైలర్ పై ప్రశంసలు కురిపించాడు.

రిషబ్ శెట్టి ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మన పూర్వికులు అంత బలమైన పనులు చేసేవారంటే రీజన్ ఇదే..
మన పూర్వికులు అంత బలమైన పనులు చేసేవారంటే రీజన్ ఇదే..
18 ఏళ్లకే 3 సినిమాలతో స్టార్ డమ్.. ఇండస్ట్రీని కుదిపేసిన హీరోయిన్
18 ఏళ్లకే 3 సినిమాలతో స్టార్ డమ్.. ఇండస్ట్రీని కుదిపేసిన హీరోయిన్
కేంద్ర ప్రభుత్వ అద్బుత పథకం.. ప్రతీ నెలా రూ.20 వేల ఆదాయం
కేంద్ర ప్రభుత్వ అద్బుత పథకం.. ప్రతీ నెలా రూ.20 వేల ఆదాయం
నాన్నే నా స్పూర్తి.. చరణ్‌తో మోదీ ఆత్మీయ సంభాషణ..
నాన్నే నా స్పూర్తి.. చరణ్‌తో మోదీ ఆత్మీయ సంభాషణ..
సీఎం విజయ్‌పై అనుచిత వ్యాఖ్యలు.. మాజీ మంత్రిపై కేసు నమోదు
సీఎం విజయ్‌పై అనుచిత వ్యాఖ్యలు.. మాజీ మంత్రిపై కేసు నమోదు
హైదరాబాద్‌లో రియల్ భూమ్.. ఆ ప్రాంతంలో రూ.80వేలు పిలికిన గజం భూమి
హైదరాబాద్‌లో రియల్ భూమ్.. ఆ ప్రాంతంలో రూ.80వేలు పిలికిన గజం భూమి
ఒక్క ఫొటోతో.. రకరకాల రూమర్స్‌కు చెక్ పెట్టిన త్రిష
ఒక్క ఫొటోతో.. రకరకాల రూమర్స్‌కు చెక్ పెట్టిన త్రిష
'చేతబడులు.. క్షుద్ర పూజలు..' సరదాగా ఈ వీకెండ్ వణికిపోవాల్సిందే
'చేతబడులు.. క్షుద్ర పూజలు..' సరదాగా ఈ వీకెండ్ వణికిపోవాల్సిందే
సారూ.. యాదికుందా? ఎద్దుపై తహసీల్దార్ ఆఫీస్‌కు రైతు.. Video వైరల్
సారూ.. యాదికుందా? ఎద్దుపై తహసీల్దార్ ఆఫీస్‌కు రైతు.. Video వైరల్
హైదరాబాద్‌లోని ఈ ప్రాంతంలో ప్రతి రోజూ ఉచితంగా టిఫిన్..
హైదరాబాద్‌లోని ఈ ప్రాంతంలో ప్రతి రోజూ ఉచితంగా టిఫిన్..