Moon Yoga: చంద్రుడి కటాక్షం.. ఈ రాశులకు ధన ధాన్య యోగాలు ఖాయం!
Telugu Astrology: మే 28 నుంచి 30 వరకు తులా రాశిలో చంద్ర సంచారం, మేషంలో కుజుడు, మిథునంలో గురువు దృష్టి కారణంగా శుభయోగాలు ఏర్పడుతున్నాయి. చంద్ర మంగళ యోగం, ధన ధాన్య సమృద్ధి యోగ ప్రభావంతో మేషం, మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారికి కోరికల నెరవేర్పు, ఆర్థిక లాభాలు, శుభవార్తలు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సాధారణంగా చంద్రుడితో ఏర్పడే ఏ యోగమైనా తప్పకుండా ఫలించే అవకాశం ఉంటుంది. అందులోనూ పౌర్ణమికి ముందు చంద్రుడితో ఏర్పడే యోగాలు రెట్టింపు ఫలితాలనిస్తాయి. ఈ నెల(మే) 28, 29, 30తేదీల్లో తులా రాశిలో చంద్రుడు సంచారం సాగిస్తాడు. ఆ రాశిలో ప్రవేశించిన చంద్రుడిని మేష రాశి నుంచి కుజుడు, మిథున రాశి నుంచి గురువు వీక్షించడం జరుగుతుంది. ఇది చంద్ర మంగళ యోగానికి, ధన ధాన్య సమృద్ధి యోగానికి దారితీస్తుంది. ఈ మూడు రోజులు ఎంతో శుభ దినాల కింద పరిగణన పొందుతాయి. మేషం, మిథునం కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారి మనసులోని కోరికలు, ఆశలు తప్పకుండా నెరవేరుతాయి.
- మేషం: ఈ రాశిలో ఉన్న కుజుడితో తులా రాశిలో ఉన్న చంద్రుడికి సమసప్తకం ఏర్పడడం, ఈ చంద్రుడిని గురువు వీక్షించడం వల్ల కొద్ది ప్రయత్నంతో ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. సొంత ఇంటి కల తప్ప కుండా నెరవేరుతుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆస్తి పాస్తుల విలువ పెరుగుతుంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు కలసి వచ్చి బ్యాంక్ బ్యాలెన్స్ వృద్ధి చెందుతుంది. ఆరోగ్య సమస్యలకు సరైన చికిత్స లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి.
- మిథునం: ఈ రాశిలో ఉన్న గురువు, లాభ స్థానంలో ఉన్న కుజుడు చంద్రుడిని వీక్షించడం వల్ల ఈ మూడు రోజుల్లో ఎటువంటి నిర్ణయం తీసుకున్నా, ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా ఫలిస్తాయి. నిరు ద్యోగులకు, ఉద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి. విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. తండ్రి వైపు నుంచి ఆస్తిపాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. సొంత ఇంటి ప్రయత్నాలు నెరవేరుతాయి.
- కర్కాటకం: చతుర్థ స్థానంలో ఉన్న రాశ్యధిపతి చంద్రుడిని ఈ రాశికి అత్యంత శుభులైన కుజ, గురువులు వీక్షించడంవల్ల ఏ ప్రయత్నం చేపట్టినా, ఏ నిర్ణ యం తీసుకున్నా తప్పకుండా సత్ఫలితానివ్వడం జరుగుతుంది. రాజపూజ్యాలు కలుగుతాయి. ధన యోగాలు పడతాయి. కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయి. అనేక వైపుల నుంచి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి. భూ లాభం కలిగే అవకాశం ఉంది.
- తుల: ఈ రాశిలో ఉన్న చంద్రుడిని కుజ, గురువుల వీక్షించడం వల్ల ఉద్యోగంలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పదోన్నతులు, జీతభత్యాల పెరుగుదలకు బాగా అవకాశం ఉంది. ఉద్యోగపరంగా ఎటువంటి ప్రయత్నాలు చేపట్టినా విజయం సాధిస్తారు. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. ఆదాయం బాగా వృద్ధి చెంది ఆర్థిక సమస్యల నుంచే కాక, వ్యక్తిగత సమస్యల నుంచి కూడా బయటపడతారు. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి.
- ధనుస్సు: ఈ రాశికి లాభ స్థానంలో చంద్ర మంగళ యోగం ఏర్పడడం, రాశ్యధిపతి గురువు కూడా చంద్రుడిని వీక్షించడం వల్ల ఏ ప్రయత్నం చేపట్టినా తప్పకుండా ఆర్థిక లాభం కలుగుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించి ఫలితాలనిస్తాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని మించుతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగా కుదుటపడుతుంది. విదేశీ సంపాదన అనుభవించే యోగం పడుతుంది.
- కుంభం: ఈ రాశికి భాగ్య స్థానంలో ఉన్న చంద్రుడిని కుజ, గురువులు వీక్షించడం వల్ల మనసులోని కోరి కలు, ఆశలు చాలావరకు నెరవేరుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. అనేక విధాలైన ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. ఉద్యోగంలో వేతనాలు వృద్ధి చెందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కష్టనష్టాల నుంచి చాలావరకు బయటపడే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా ఇతర దేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది.
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష్యం, మతం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)