AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చాలా సింపుల్.. మీ మల్లె చెట్టు చిన్నదైనా కొమ్మ కొమ్మకి పూలు పూయాలంటే ఇలా చేయండి..

మల్లె మొక్కకు ఎంత సంరక్షణ చేసినా పూలు రావడం లేదా? అయితే సరైన సమయంలో ప్రూనింగ్ చేయడం, పోషకాలు అధికంగా ఉండే ఎరువులు వేయడం, తగినంత సూర్యరశ్మి అందించడం ద్వారా మల్లె మొక్కను మొగ్గలు, పూలతో నింపవచ్చని తోటమాలి నిపుణులు చెబుతున్నారు. ఈ సులభమైన చిట్కాలను పాటిస్తే కుండీలోనైనా, నేలలోనైనా మల్లె మొక్క విరివిగా పుష్పించి మీ ఇంటిని సువాసనతో నింపుతుంది..

చాలా సింపుల్.. మీ మల్లె చెట్టు చిన్నదైనా కొమ్మ కొమ్మకి పూలు పూయాలంటే ఇలా చేయండి..
Jasmine Plant Care
Shaik Madar Saheb
|

Updated on: Jul 26, 2026 | 5:26 PM

Share

మంచి అందమైన, సువాసన వచ్చే మొక్కలలో మల్లె మొక్కలకు ప్రత్యేక స్థానం ఉంది. దాదాపు అందరి ఇళ్లల్లోనూ మల్లె మొక్కలు ఉంటాయి.. ఇవి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.. అయితే.. మీ దగ్గర మల్లె మొక్క ఉండి, దానికి సరిగా పూలు రాకపోయినా, లేదా ఎంత ప్రయత్నించినా పుష్పించకపోయినా, ఈ కథనంలో నిపుణులైన తోటమాలి అందించిన అమూల్యమైన చిట్కాలను తెలుసుకుందాం. ఈ సూచనలను పాటించడం ద్వారా మీ మల్లె మొక్క కూడా మొగ్గలు, పూలతో నిండిపోయి, మీ తోటను సువాసనతో నింపుతుంది. మల్లె మొక్కలు విరివిగా పూయడానికి మూడు ముఖ్యమైన అంశాలు కీలక పాత్ర పోషిస్తాయి.. సరైన సమయంలో ప్రూనింగ్ చేయడం, మొక్కకు అవసరమైన పోషకాలను అందించే మంచి ఫర్టిలైజర్ వాడకం, తగినంత సూర్యరశ్మి. ఈ మూడు విషయాలను దృష్టిలో ఉంచుకొని మల్లె మొక్కల సంరక్షణ చేసినట్లయితే అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. ఈ పద్ధతులు కంటైనర్‌లలో పెంచుకునే మొక్కలకైనా లేదా నేల మీద ఉన్న మొక్కలకైనా చాలా బాగా పనిచేస్తాయి.. ముఖ్యంగా ఈ సీజన్‌లో మల్లె మొక్కల సంరక్షణతో బాగా పూలు పూస్తాయి..

సరైన ప్రూనింగ్: మల్లె మొక్కలకు పూలు ఎప్పుడూ కొత్తగా వచ్చే కొమ్మలకు మాత్రమే వస్తాయి. పాతవి, ఓల్డ్ అయిపోయిన కొమ్మలకు పూత రాదు. అందుకే ప్రూనింగ్ అనేది చాలా ముఖ్యం. ఇది మొక్కకు కొత్త చిగుర్లు, కొమ్మలు రావడానికి సహాయపడుతుంది, ఫలితంగా ఎక్కువ పూలు వస్తాయి.

మంచి ఫర్టిలైజర్ అందించడం:

ప్రూనింగ్ చేసుకున్న తర్వాత ఏ మొక్కలకైనా సరే మంచి ఫర్టిలైజర్ ని ఇవ్వడం చాలా అవసరం. మల్లె మొక్కలు కూడా ఫర్టిలైజర్ ని బాగా ఇష్టపడతాయి. ముఖ్యంగా గత సమ్మర్‌లో ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం వాటిని నిర్లక్ష్యం చేసి, ఎరువులు వేసి ఉండకపోవచ్చు. కాబట్టి, పుష్కలంగా పూలు రావాలంటే ఖచ్చితంగా మంచి పోషకాలను అందించాలి. బయో-ఆర్గానిక్ DAP, NPK (19:19:19), బోన్‌మీల్, రాక్ ఫాస్ఫేట్, ఆవపిండి, వేరుశెనగ పిండి వంటివి మల్లె మొక్కల పుష్పించడానికి బాగా సహాయపడతాయి. ఈ ఫర్టిలైజర్‌లను క్రమం తప్పకుండా, సరైన మోతాదులో ఇవ్వడం వల్ల మొక్కకు కావలసిన పోషకాలు అంది, ఆరోగ్యంగా పెరుగుతుంది.

తగినంత సూర్యరశ్మి:

మల్లె మొక్కలకు ఎండ అవసరం. అసలు మల్లె పూలు ఎక్కువగా ఎండ బాగా ఉన్న టైంలోనే పూస్తాయి. కాబట్టి, మీ మల్లె మొక్కను ఎండ బాగా తగిలే ప్రదేశంలో ఉంచండి. రోజుకు కనీసం 6-8 గంటల సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి. ఎండ సరిగా తగలకపోతే, మొక్క పెరిగినా కూడా పూలు సరిగా పూయవు లేదా పూలు చిన్నవిగా వస్తాయి.

తోటమాలి అందించిన ఈ చిట్కాలను పాటిస్తే, మీ చిన్న మల్లె మొక్క కూడా కొమ్మకొమ్మకి మల్లెపూలను పూస్తుంది. కంటైనర్లలో పెంచుకుంటున్న మొక్కలు కూడా చాలా చక్కగా పూస్తాయి. మీ తోటను సువాసనభరితం చేయడానికి ఈ చిట్కాలు తప్పకుండా పాటించండి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us