మున్సిపల్ చట్ట బిల్లు.. గవర్నర్ అభ్యంతరాలేమిటి ?

తెలంగాణ మున్సిపల్ చట్టబిల్లుకు గవర్నర్ నరసింహన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఈ బిల్లుకు ఆయన ఆమోదం లభించలేదు. స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కొన్ని అంశాలపై ఆయన విభేదించడంతో ఇది ఆయన ఆమోదానికి నోచుకోలేకపోయింది. ఆయన సూచించిన అంశాలతో ప్రభుత్వం తాజాగా ఆర్డినెన్స్ జారీ చేసింది. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వానికే పూర్తి స్థాయి అధికారాలు ఉండడంపట్ల గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. కాగా-ఈ బిల్లును తెలంగాణ అసెంబ్లీ ఆమోదించడం, ఇందులోని కీలకాంశాలను సీఎం కేసీఆర్ […]

మున్సిపల్ చట్ట బిల్లు.. గవర్నర్ అభ్యంతరాలేమిటి ?
Anil kumar poka

| Edited By: Pardhasaradhi Peri

Jul 23, 2019 | 2:32 PM

తెలంగాణ మున్సిపల్ చట్టబిల్లుకు గవర్నర్ నరసింహన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఈ బిల్లుకు ఆయన ఆమోదం లభించలేదు. స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కొన్ని అంశాలపై ఆయన విభేదించడంతో ఇది ఆయన ఆమోదానికి నోచుకోలేకపోయింది. ఆయన సూచించిన అంశాలతో ప్రభుత్వం తాజాగా ఆర్డినెన్స్ జారీ చేసింది. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వానికే పూర్తి స్థాయి అధికారాలు ఉండడంపట్ల గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. కాగా-ఈ బిల్లును తెలంగాణ అసెంబ్లీ ఆమోదించడం, ఇందులోని కీలకాంశాలను సీఎం కేసీఆర్ వివరించి.. ఇది అవినీతి నిర్మూలనకు ఎంతో తోడ్పడుతుందని ప్రకటించడం తెలిసిందే. కానీ ఈ బిల్లును వ్యతిరేకించిన బీజేపీ.. ఓ ప్రతినిధి బృందంగా ఏర్పడి.. గవర్నర్ ను కలిసింది. ఈ బిల్లు విషయంలో జోక్యం చేసుకోవాలని ఆయనను కోరింది. అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత బండారు దత్తాత్రేయ.. బిల్లు పూర్తిగా రాజ్యాంగ విరుధ్దమని అన్నారు. స్థానిక సంస్థలకు సంబంధించిన 73, 74 రాజ్యాంగ సవరణలకు ఇది వ్యతిరేకంగా ఉందని, ఈ సవరణలు ..ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి పూర్తి అధికారాలు ఉండాలని నిర్దేశించాయని ఆయన అన్నారు. కానీ… కొత్త చట్టం పేరిట ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియను తన హస్తగతం చేసుకుంటోందని ఆయన విమర్శించారు. ఈ బిల్లుకు ఆమోదం తెలిపే ముందు గవర్నర్ ఈ రాజ్యాంగ వ్యతిరేక అంశాలను పరిశీలించాలని తాము కోరామని ఆయన చెప్పారు. దీన్ని అసెంబ్లీకి తిప్పి పంపి.. రాజ్యాంగ విరుధ్ధంగా ఉన్న అంశాలను తొలగించాకే ఆమోదించేలా చూడాలని అభ్యర్థించామన్నారు. ఈ మున్సిపల్ చట్టం వల్ల రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారే ప్రమాదం ఉందన్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu