స్వీయ నిర్బంధంలోకి గవర్నర్ దత్తాత్రేయ

కరోనా ప్రభావం దేశమంతా ఉంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు కరోనా బాధితులుగా మారుతున్నారు. తాజాగా హిమాచల్ ప్రదేశ్ విద్యుత్‌శాఖ మంత్రి సుఖ్ రామ్ చౌదరికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ ప్రభావం ఆ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయపై పడింది. మంత్రి సుఖ్ రామ్ చౌదరికీ సన్నిహితంగా ఉంటున్న మరికొందరు మంత్రులు సైతం హో క్వారంటైన్ లో వెళ్లిపోయారు. మంత్రి సుఖ్ రామ్‌కు ఇన్ఫెక్షన్ సోకినట్టు తేలడంతో గవర్నర్ బండారు దత్తాత్రేయ స్వీయ నిర్బంధంలోకి […]

స్వీయ నిర్బంధంలోకి గవర్నర్ దత్తాత్రేయ

కరోనా ప్రభావం దేశమంతా ఉంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు కరోనా బాధితులుగా మారుతున్నారు. తాజాగా హిమాచల్ ప్రదేశ్ విద్యుత్‌శాఖ మంత్రి సుఖ్ రామ్ చౌదరికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ ప్రభావం ఆ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయపై పడింది. మంత్రి సుఖ్ రామ్ చౌదరికీ సన్నిహితంగా ఉంటున్న మరికొందరు మంత్రులు సైతం హో క్వారంటైన్ లో వెళ్లిపోయారు.

మంత్రి సుఖ్ రామ్‌కు ఇన్ఫెక్షన్ సోకినట్టు తేలడంతో గవర్నర్ బండారు దత్తాత్రేయ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఆయనతో పాటు బీజేపీ సీనియర్ నేతలు ప్రేమ్ కుమార్ ధూమల్, సురేశ్ కశ్యప్ తదితరులు కూడా క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఇటీవల రాజ్‌భవన్‌లో సుఖ్‌రామ్ చౌదరి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ముందు జాగ్రత్తగా గవర్నర్ దత్తాత్రేయ తన అధికారిక కార్యక్రమాలు, సమావేశాలన్నీ రద్దు చేసుకున్నట్టు రాజ్‌భవన్ వెల్లడించాయి. ప్రస్తుతం ఆయనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలూ లేవని రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి.

Click on your DTH Provider to Add TV9 Telugu