Ap Local Body Polls: ఏపీ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలకు ప్రోత్సాహకం పెంపు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్

పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలకు ప్రోత్సాహకం పెంచుతూ  ఏపీ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. రూ.20 లక్షల వరకు ప్రోత్సాహకం ప్రకటిస్తూ ఉత్తర్వులు వెలువరించింది.

Ap Local Body Polls: ఏపీ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలకు ప్రోత్సాహకం పెంపు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్
AP-Government-
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 26, 2021 | 8:00 PM

Ap Local Body Polls: పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలకు ప్రోత్సాహకం పెంచుతూ  ఏపీ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. రూ.20 లక్షల వరకు ప్రోత్సాహకం ప్రకటిస్తూ ఉత్తర్వులు వెలువరించింది. 2 వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.5 లక్షలు, 2 నుంచి 5 వేల జనాభా ఉన్నవాటికి రూ.10 లక్షలు, 5 నుంచి 10 వేల జనాభా ఉన్నవాటికి రూ.15 లక్షలు, 15 వేల జనాభా దాటిన గ్రామాలకు రూ.20 లక్షల ప్రోత్సాహకం ఇవ్వనున్నట్లు వివరించింది. ప్రస్తుత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈ ప్రోత్సాహకాలకు విస్తృతంగా ప్రచారం కల్పించాలని సీఎస్ ఆదిత్యనాథ్ దాస్  అధికారులకు సూచించారు.

ఏపీ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ స్పీడ్‌ పెంచారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు కావాల్సిన అన్ని హంగులను సమకూర్చుకుంటున్నారు. ఇప్పటికే విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై బదిలీ వేటు వేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం శాంతి భద్రతల అంశంపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది.

పంచాయతీ ఎన్నికల్లో శాంతిభద్రతల పర్యవేక్షణకు ఐజీ స్థాయి అధికారిని నియమించారు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమర్‌. డాక్టర్‌ సంజయ్‌ని శాంతిభద్రతల పర్యవేక్షణ అధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏకగ్రీవాలు, హింస, అల్లర్లు, కోడ్‌ ఉల్లంఘనలను ఐజీ సంజయ్‌ పర్యవేక్షిస్తారు. ఈ మేరకు ఎస్‌ఈసీని కలిసి ఐజీ సంజయ్ రిపోర్ట్‌ చేశారు.

Also Read:

Black Magic: కర్నూలు జిల్లాలో క్షుద్రపూజల కలకలం.. వింత పూజల నేపథ్యంలో స్థానికుల్లో భయం, భయం

Air pollution: వాయు కాలుష్యం కారణంగా అబార్షన్లు.. శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైన సంచలన విషయాలు