AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎస్‌బీఐ కస్టమర్లకు శుభవార్త

ప్రభుత్వ రంగ దిగ్గజమైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన ఖాతాదారులకు తీపికబురు అందించింది. రుణ రేట్లలో కోత విధించింది. ఎంసీఎల్ఆర్ రేటును 5 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. రుణ రేట్ల తగ్గింపు ఏప్రిల్ 10 నుంచి అమలులోకి వస్తుందని బ్యాంక్ తెలిపింది. ఏడాది కాలపు రుణాలపై సవరించిన ఎంసీఎల్ఆర్ రేటు 8.50 శాతంగా ఉంది. గృహ రుణాలపై వడ్డీ రేటును 10 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. రూ.30 లక్షల వరకు ఉన్న […]

ఎస్‌బీఐ కస్టమర్లకు శుభవార్త
TV9 Telugu Digital Desk
|

Updated on: Apr 09, 2019 | 9:54 PM

Share

ప్రభుత్వ రంగ దిగ్గజమైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన ఖాతాదారులకు తీపికబురు అందించింది. రుణ రేట్లలో కోత విధించింది. ఎంసీఎల్ఆర్ రేటును 5 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. రుణ రేట్ల తగ్గింపు ఏప్రిల్ 10 నుంచి అమలులోకి వస్తుందని బ్యాంక్ తెలిపింది.

ఏడాది కాలపు రుణాలపై సవరించిన ఎంసీఎల్ఆర్ రేటు 8.50 శాతంగా ఉంది. గృహ రుణాలపై వడ్డీ రేటును 10 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. రూ.30 లక్షల వరకు ఉన్న రుణాలకే ఇది వర్తిస్తుంది. దీంతో రూ.30 లక్షలలోపు ఉన్న గృహ రుణాలపై వడ్డీ రేటు శ్రేణి 8.70-9 శాతం నుంచి 8.60-8.90 శాతానికి దిగొచ్చింది.

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఏప్రిల్ 4న రెపో రేటు పావు శాతం తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో రెపో రేటు 6 శాతానికి దిగొచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కూడా ఎంసీఎల్ఆర్ రేటు తగ్గించింది. ఇప్పుడు ఎస్‌బీఐ కూడా హెచ్‌డీఎఫ్‌సీ దారిలోనే వెళ్లింది.

Follow Us