వర్షాకాలం వచ్చిందంటే చాలు చాలా మంది జలపాతల వద్దకు వెళ్లి సందడి చేస్తుంటారు. అయితే తెలంగాణలో ఈ సమయంలో చూడాల్సిన అందమైన జలపాతాలు ఉన్నాయంట. అవి ఏవో చూద్దాం.
వర్షా కాలం
కుంతాలా జలపాతం, ఇది ఆదిలాబాద్ జిల్లాలోని నేరుడి గొండ గ్రామం సమీపంలో ఉంది. తెలంగాణలో ఎత్తైన జలపాతాల్లో ఇది కూడా ఒకటి, పర్యాటకులను ఆకట్టుకోవడంలో ఇది చాలా ముందు ఉంటుంది.
కుంతాలా జలపాతం
అదే విధంగా, పొచ్చెర జలపాతం, ఇది చాలా లోతైన జలపాతం. నిర్మాల్ జిల్లాలో ఉన్న ఈ జలపాతం, పచ్చని చెట్ల మధ్య ఎత్తైన కొండల మధ్య చాలా అందంగా ఉంటుంది.
పొచ్చెర జలపాతం
గాయత్రి జలపాతం, అందమైన జలపాతాల్లో ఇది కూడా ఒకటి. ఇది కూడా నిర్మాల్ జిల్లాలోనే ఉంది. దీనిని గోదావరికి ఉపనది అని కూడా అంటారు. అడువుల్లో దీని సందడి చాలా అద్భుతంగా ఉంటుందంట.
గాయత్రి జలపాతం
అలాగే కలకై జలపాతం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీనిని కనకదుర్గజలపాతం కూడా అంటారు. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న అందమైన జలపాతాల్లో ఇది కూడా ఒకటి.
కలకై జలపాతం
ఇక తెలంగాణలో ఫేమస్ జలపాత్లో బొగతం జలపాతం కూడా ఒకటి. దీనిని తెలంగాణ నయాగారం అని కూడా పిలుస్తారు. ఇది ములుగు జిల్లాకు దగ్గరిలో ఉంటుంది.
బొగతం
రాయకల్ జలపాతం. ఇది కరీంనగర్ జిల్లాలో ఉంది. చాలా అందమైన జలపాతంలో ఇది కూడా ఒకటి. ఇది పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంటుంది.