బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే..
బంగారం, వెండి ధరల్లో మళ్లీ స్వల్ప తగ్గుదల నమోదైంది. గత వారం రోజుల్లో బంగారం ధర దాదాపు రూ.5 వేల వరకు తగ్గినట్లు మార్కెట్ ధరల పరిశీలనలో తెలుస్తోంది. అక్టోబర్ 2 ఉదయం 6 గంటల వరకు నమోదైన ధరల ప్రకారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

బంగారం, వెండి ధరల్లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి.. ఇటీవల భారీగా పెరిగిన ధరలు.. మళ్లీ తగ్గి కాస్త ఊరటనిచ్చాయి.. గత వారం రోజుల నుంచి ధరలను పరిశీలిస్తే.. దాదాపు రూ.5వేల వరకు తగ్గింది. అంతర్జాతీయంగా కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులతో మార్పులు జరుగుతున్నట్లు బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం, రష్యా-ఉక్రెయిన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో గోల్డ్ రేట్లపై తీవ్ర ప్రభావం చూపుతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. పలు వెబ్సైట్లలో నమోదైన ధరల ఆధారంగా శుక్రవారం (అక్టోబర్ 2) ఉదయం 6 గంటల వరకు దేశీయంగా బంగారం, వెండి ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి.
24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరపై 10 తగ్గి.. రూ.1,49,230 గా ఉంది.
22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధరపై 10 తగ్గి.. రూ.1,36,790 గా ఉంది.
వెండి కిలో ధరపై 100 తగ్గి.. రూ.2,34,900 లుగా కొనసాగుతోంది.
అయితే.. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యాత్యాసం ఉంటుంది.
హైదరాబాద్లో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,49,230, 22 క్యారెట్ల ధర రూ.1,36,790 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,39,900 ఉంది.
విజయవాడలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,49,230, 22 క్యారెట్ల ధర రూ.1,36,790 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,39,900 ఉంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,49,400, 22 క్యారెట్ల ధర రూ.1,36,940 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,34,900 ఉంది.
ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,49,230, 22 క్యారెట్ల ధర రూ.1,36,790 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,34,900 లుగా ఉంది.
చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,49,230, 22 క్యారెట్ల ధర రూ.1,36,790 ఉంది. వెండి కిలో ధర రూ.2,39,900 ఉంది.
బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,49,230, 22 క్యారెట్ల ధర రూ.1,36,790 ఉంది. వెండి కిలో ధర రూ.2,34,900 లుగా ఉంది.
కాగా.. బంగారం, వెండి ధరలు అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు.. స్థానిక డిమాండ్, సరఫరా, అలాగే రాష్ట్ర పన్నులు, తదితర అంశాల ప్రకారం ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. అందుకే అన్ని ప్రధాన నగరాల్లో కూడా ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
