AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPI Charges: యూపీఐ ఛార్జీలు తప్పించుకోవడానికి ఈ ట్రిక్ పాాటిస్తే అంతే సంగతులు.. యూపీఐ బ్లాక్ అయ్యే ఛాన్స్..!

అక్టోబర్ 15వ తేదీ నుంచి రూ.2,000 కంటే ఎక్కువ UPI లావాదేవీలపై 0.4 శాతం MDR ఛార్జ్ వ్యాపారులకు వర్తిస్తుంది. ఈ ఛార్జీని కస్టమర్లపైకి నెట్టకుండా సులభంగా తప్పించుకోవడానికి ఒక మార్గం ఉంది. లావాదేవీలను చిన్న మొత్తాలుగా విభజించడం ద్వారా MDR నుండి మీరు బయటపడవచ్చు. ఇలా చేయడం వల్ల చిక్కులు వస్తాయా..?

UPI Charges: యూపీఐ ఛార్జీలు తప్పించుకోవడానికి ఈ ట్రిక్ పాాటిస్తే అంతే సంగతులు.. యూపీఐ బ్లాక్ అయ్యే ఛాన్స్..!
Upi Charges
Venkatrao Lella
|

Updated on: Oct 01, 2026 | 9:39 PM

Share

ఇప్పటివరకు యూపీఐ లావాదేవీలు ఉచితంగా చేసుకునే వెసులుబాటు ఉండేది. కానీ ఇంకొద్ది రోజుల్లో యూపీఐ లావాదేవీలకు ఛార్జీలు పడనున్నాయి. అవును.. అక్టోబర్ 15వ నుండి కొత్త UPI నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈ కొత్త UPI నిబంధనల ప్రకారం రూ.2,000 కంటే ఎక్కువ విలువైన UPI మర్చంట్ లావాదేవీలపై 0.4 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) వర్తిస్తుంది. ఉదాహరణకు ఒక కస్టమర్ రూ.3,000 బిల్లు చెల్లించినట్లయితే.. వ్యాపారికి రూ.12 MDR ఛార్జ్ పడుతుంది. ఈ MDR అనేది వ్యాపారి వైపున వర్తించే ఛార్జ్‌గా చెప్పవచ్చు. దీనిని కస్టమర్లపైకి బదిలీ చేయకూడదు. అయితే కొన్ని సందర్భాల్లో వ్యాపారులు ఈ అదనపు ఛార్జీలను కస్టమర్ల నుండి వసూలు చేయడానికి ప్రయత్నించవచ్చు. అలాంటి సమయంలో కస్టమర్లు, వ్యాపారులు ఇద్దరూ MDR ఛార్జీల భారం నుండి తప్పించుకోవడానికి ఒక సులభమైన ఆలోచన చేస్తున్నారు. అదేంటి అంటే.. రూ.2,000 కంటే ఎక్కువ మొత్తంలో చేసే లావాదేవీలను చిన్న మొత్తాలుగా విభజించి చెల్లించడం ద్వారా ఈ ఛార్జీలను నివారించవచ్చని యోచిస్తున్నారు.

చిక్కుల్లో పడే అవకాశం..

ఉదాహరణకు రూ.3,000 చెల్లించాల్సి వస్తే.. ఆ మొత్తాన్ని రెండు రూ.1,500 లావాదేవీలుగా విభజించి చెల్లించవచ్చు. ఒక్కో లావాదేవీ రూ.2,000 కంటే తక్కువగా ఉండటం వల్ల MDR ఛార్జ్ వర్తించదు. ఈ పద్ధతి ద్వారా కస్టమర్, వ్యాపారి ఇద్దరూ అదనపు ఛార్జీలు చెల్లించకుండా డిజిటల్ చెల్లింపుల ప్రయోజనాలను పొందవచ్చు. MDR ఛార్జీల అప్లికేబిలిటీ, రేట్లు వ్యాపారి వర్గం, వర్తించే నిబంధనలపై ఆధారపడి మారవచ్చు. అయితే అలా విభజించి యూపీఐ పేమెంట్ చేయడం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.  తక్కువ వ్యవధిలో ఒకే వ్యాపారికి పదేపదే ఒకే మొత్తాన్ని ట్రాన్స్‌ఫర్ చేయడం వల్ల బ్యాంకు మోసాల పర్యవేక్షణ వ్యవస్థ దీనిని అసాధారణమైనదిగా పరిగణించవచ్చని చెబుతున్నారు. బ్యాంకులు ఎప్పటికప్పుడు వినియోగదారుల లావాదేవీలను పర్యవేక్షిస్తాయి. ఒక వినియోగదారుడు తక్కువ వ్యవధిలో ఒకే వ్యాపారికి పదేపదే తక్కువ సమయంలో డబ్బులు పంపడం వల్ల చిక్కులు ఎదురుకావొచ్చు.

యూపీఐ వ్యవస్థలో మార్పులు..

ఇలాంటి సందర్భాల్లో లావాదేవీలను తాత్కాలికంగా నిలిపివేసే అవకాశం ఉంటుంది. లేదా యూపీఐ సేవను తాత్కాలికంగా నిలిపివేసే ప్రమాదముంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే కొన్ని బ్యాంకులు రోజువారీ లావాదేవీలపై పరిమితులు విధిస్తాయి. మీరు ఒకే దుకాణాదారుడికి నాలుగుసార్లు లావాదేవీలు చేయడం వల్ల మీ లిమిట్ అయిపోతుంది. దీని వల్ల వేరేవారికి పేమెంట్స్ చేయలేరు. అయితే ఇలాంటి ఎత్తుగడలను నివారించేందుకు యూపీఐ వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చే అవకాశం భవిష్యత్తులో ఉంటుంది. అదనపు భద్రతా వ్యవస్థలను ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. 

Follow Us