AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మంచి తరుణం మించిన దొరకదు..! వెండి, బంగారంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయమా.!

వెండి, బంగారంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం అంటున్నారు నిఫుణులు. బంగారు, వెండిపై దిగుమతి సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజా..

మంచి తరుణం మించిన దొరకదు..! వెండి, బంగారంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయమా.!
Venkata Narayana
|

Updated on: Feb 03, 2021 | 3:02 AM

Share

వెండి, బంగారంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం అంటున్నారు నిఫుణులు. బంగారు, వెండిపై దిగుమతి సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజా బడ్జెట్ లో చేసిన ప్రకటన ఆభరణాల మార్కెట్లలో ప్రతిబింబించడం ప్రారంభించిందని చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ధర పెరిగినప్పటికీ బంగారం ధరలు గణనీయంగా పడిపోవడానికి ఇదే కారణమని ఏంజెల్ బ్రోకింగ్‌ కమోడిటీ అండ్ కరెన్సీ రీసెర్చ్ డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ అనుజ్ గుప్తా అభిప్రాయ పడ్డారు. అయితే, భౌతిక మార్కెట్లో ధరల హెచ్చుతగ్గులు అంతగా లేవని ఆయన అన్నారు. సోమవారం బడ్జెట్ 2021 ప్రకటనకు ముందు, బంగారం స్పాట్ ధర సుమారు రూ .50,000. ఇదిప్పుడు 49,500 రూపాయలుగా ఉందని ఆయన తెలిపారు. సోమవారం వెండిపై దాదాపు 3000 రూపాయలు పెరిగినప్పటికీ అంతగా ప్రభావం చూపలేదని, మంగళవారం దాదాపు 1500 రూపాయల మేర వెండిరేటు తగ్గిందని ఆయన తెలిపారు. అయితే, బంగారం, వెండిని కొనడానికి ఇప్పుడు సరైన సమయం అని ఆయన అన్నారు. ఇదే సందర్భంలో మరో వాదనకూడా వినిపిస్తోంది. బంగారం ధరలు మరింత దిగిరానున్నాయని.. కొన్ని రోజులు ఆగితే మంచిదని నిపుణులు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి కోవిడ్ సమయంలో భారీగా పెరిగిన బంగారం ధరలు జనవరి 6 నుంచి మెల్లగా తగ్గుముఖం పట్టాయి. అయితే బంగారు నగలు కొనుగోళ్లు భారీగా పెరిగితే మాత్రం మళ్ళీ బంగారం ధర పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెప్పారు.

ఇదిలాఉండగా, మంగళవారం పసిడి ధర రూ. 480 తగ్గడంతో దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం రూ. 47,702 పలికింది. క్రితం సెషన్‌ ముగింపు సమయానికి ఈ ధర రూ. 48,182గా ఉంది. అయితే, సోమవారం కూడా బంగారం ధర తగ్గింది. ఇక వెండి కూడా మంగళవారం పసిడి దారిలోనే పయనించింది. రూ. 3,097 తగ్గడంతో కేజీ వెండి ధర రూ. 70,122కు పడిపోయింది. అమెరికా ఉద్దీపన ప్యాకేజీపై ఎలాంటి పురోగతి లేకపోవడంతో అంతర్జాతీయంగా బంగారం ధర తగ్గిందని గుప్తా చెప్పుకొచ్చారు. ఇలాఉండగా, అధిక పన్నుభారం వల్ల దేశంలో బంగారం స్మగ్లింగ్‌ పెరిగిన నేపథ్యంలో అక్రమాలను అరికట్టడంతో పాటు, రత్నాభరణాల ఎగుమతులకు ఊతమిచ్చేందుకు గానూ బంగారం, వెండి ధరలపై దిగుమతి సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో చెప్పారు. ప్రస్తుతం వీటిపై 12.5శాతం కస్టమ్స్‌ సుంకం ఉండగా.. దీన్ని 7.5శాతానికి తగ్గిస్తూ కేంద్రం బడ్జెట్లో తన నిర్ణయాన్ని వెలిబుచ్చింది.