Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Blood Pressure: ఈ చిన్న జాగ్రత్తలు పాటించండి.. రక్తపోటును అదుపులో ఉంచుకోండి.. ఆరోగ్యాన్ని పదిలం చేసుకోండి..

Blood Pressure: ప్రస్తుత ఉరుకులు పరుగుల ప్రపంచంలో మనుషులు బిజీ బిజీగా గడుపుతున్నారు. అదే వారి ఆరోగ్యం పాలిట శాపంగా మారుతోంది.

Blood Pressure: ఈ చిన్న జాగ్రత్తలు పాటించండి.. రక్తపోటును అదుపులో ఉంచుకోండి.. ఆరోగ్యాన్ని పదిలం చేసుకోండి..
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 03, 2021 | 2:36 AM

Blood Pressure: ప్రస్తుత ఉరుకులు పరుగుల ప్రపంచంలో మనుషులు బిజీ బిజీగా గడుపుతున్నారు. అదే వారి ఆరోగ్యం పాలిట శాపంగా మారుతోంది. ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా పనులలో నిమగ్నమైపోతున్నారు. దాంతో చివరికి అనారోగ్యం పాలవుతున్నారు. ఈ ఉరుకులు, పరుగుల జీవితం కారణంగా ముఖ్యంగా మనుషులకు బీపీ(రక్తపోటు), మధుమేహం(షుగర్) వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రక్తపోటు సమస్య ఎందరినో వేధిస్తోంది. ఈ నేపథ్యంలో ఇలాంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాలంటే జీవన శైలిలో చిన్నపాటి మార్పులు చేసుకుంటే సరిపోతుందని చెబుతున్నారు. అలాగే.. తినే ఆహార పదార్థాల విషయంలోనూ జాగ్రత్తలు పాటిస్తే రక్తపోటు నియంత్రణలో ఉంటుందని చెబుతున్నారు.

వైద్య నిపుణులు చెప్పిన సలహాల మేరకు ఏం చేయకూడదు.. మనం రోజూ తినే ఆహార పదార్థాలు రక్తపోటుపెరగడానికి ప్రధాన కారణం అవుతాయి. ఈ నేపథ్యంలో వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా సోడియం అధికంగా ఉండే ఆహారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సోడియం, పొటాషియం సమతులంగా ఉండేలా శుద్ధి చేయని నల్ల ఉప్పు లేదా రాతి ఉప్పు వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. శుద్ధి చేసిన తెల్లని ఉప్పులో కేవలం సోడియం మాత్రమే ఉంటుందని, పొటాషియం ఉండదు. అందువల్ల రాతి ఉప్పును వాడితే ఆరోగ్యానికి ప్రయోజనం. ఫ్రై చేసిన ఆహార పదార్థాలను అధికంగా తినొద్దు. ముఖ్యంగా ప్యాకింగ్ చేసిన ఫ్రైడ్ ఆహార పదార్థలను తీసుకోవద్దు. వాటి వల్ల రక్తపోటులో హెచ్చు తగ్గులు వస్తాయి. ఇక శరీరానికి సరైన విశ్రాంతి ఇవ్వకపోవడం వల్ల కూడా రక్తపోటు పెరిగే అవకాశం ఎక్కువ.

ఏం చెస్తే మంచిది.. రోజూ కాసేపు నడవాలి. యోగాసనాలు చేయలి. వ్యాయామం చేయడం వల్ల రక్తపోటు నియంత్రణలోకి వస్తుంది. అలాగే సయమానికి నిద్ర పోవాలి. శరీరానికి సరిపడా విశ్రాంతిని ఇవ్వాలి. చిరు దాన్యాలు తినడం ద్వారా రక్తపోటు అదుపులో ఉంటుంది. అలాగే.. నల్ల మిరియాలు, జీలకర్ర ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి.

Also read:

Ashok Dinda: క్రికెట్‌కు గుడ్ బై టీమిండియా ఫాస్ట్ బౌలర్.. మూడు ఫార్మట్లకూ రిటైర్మెంట్ ప్రకటన..

Ujjwala Yojana: ఉచిత గ్యాస్ పథకానికి మీరు అర్హులా? అయితే ఇలా వెంటనే దరఖాస్తు చేసుకోండి..