కరోనా మహమ్మారి ఫుణ్యమాని ఫైజర్ పంటపండుతోంది. ఈ ఏడాది కోవిడ్ వ్యాక్సిన్ అమ్మకం ద్వారా వచ్చే ధనరాశులెన్నో తెలుసా?

కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలనూ అతలాకుతలం చేస్తే, ఇప్పుడు అదే కరోనా, ఫార్మా సంస్థలకు ధనరాశులు తెచ్చిపోస్తోంది. అమెరికన్ మల్టీనేషనల్ ఫార్మాస్యూటికల్..

  • Venkata Narayana
  • Publish Date - 1:29 am, Wed, 3 February 21
కరోనా మహమ్మారి ఫుణ్యమాని ఫైజర్ పంటపండుతోంది.  ఈ ఏడాది కోవిడ్ వ్యాక్సిన్ అమ్మకం ద్వారా వచ్చే ధనరాశులెన్నో తెలుసా?
Pfizer vaccine

కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలనూ అతలాకుతలం చేస్తే, ఇప్పుడు అదే కరోనా, ఫార్మా సంస్థలకు ధనరాశులు తెచ్చిపోస్తోంది. అమెరికన్ మల్టీనేషనల్ ఫార్మాస్యూటికల్ కార్పొరేషన్ ఫైజర్, కొవిడ్ వ్యాక్సిన్ అమ్మడం ద్వారా ఎంత సంపాదిస్తున్నామో తెలియజెప్పింది. కరోనా వైరస్ ను అంతమొందించేందుకు ఫైజర్ కంపెనీ తీసుకొచ్చిన కరోనావైరస్ వ్యాక్సిన్ ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల అమ్మకాలను సంపాదించగలదని సంస్థ భావిస్తోంది. ఫైజర్, బయోఎన్ టెక్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కోవిడ్ -19 వ్యాక్సిన్ అమ్మకాలు 2021 లో 15 బిలియన్ డాలర్లకు(దాదాపు 110 కోట్ల రూపాయలు) చేరుకోగలవని సంస్థ లెక్కలు కట్టింది.

అంతేకాదు, చేతిలో ఉన్న ఆర్డర్లే కాకుండా రాబోయే రోజుల్లో మరిన్ని వ్యాక్సిన్ సరఫరాకు ఒప్పందాలు జరిగే అవకాశముందని పేర్కొంది. ఈ దిశగా సంతకాలు జరిగితే, చేకూరే ఆదాయం మరింత అధికంగా ఉంటుందని ఫైజర్ సంస్థ వెల్లడించింది. 2021 సంవత్సరంలో ఫైజర్ అమ్మకాలు 59.4 బిలియన్ డాలర్ల నుండి 61.4 బిలియన్ డాలర్ల మధ్య ఉంటాయని సంస్థ అంచనా వేస్తోంది. సంస్థకు చేకూరే మొత్తం అమ్మకాల్లో నాలుగవ వంతు కోవిడ్ -19 వ్యాక్సిన్ అమ్మకాల ద్వారానే వచ్చే అవకాశం ఉందని ఫైజర్ తెలిపింది. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ప్రజలు కరోనా వ్యాక్సినేషన్ వేయించుకోవడం ద్వారా, తమ సంస్థ అమ్మకాలు ఘణనీయంగా ఉంటాయని ఫైజర్ అంచనా వేస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా ప్రజలు కరోనా టీకాలు తీసుకోవడం తద్వారా స్థూల ఆర్థిక, ఆరోగ్య సంరక్షణ కార్యకలాపాల పునరుద్ధరణ జరుగుతుందని ఫైజర్ చెబుతోంది. ఇలాఉంటే, కరోనా వ్యాక్సినేషన్ మొదలైన నేపథ్యంలో ఫైజర్ నాల్గవ త్రైమాసిక నికర ఆదాయం 594 మిలియన్ డాలర్లుగా నమోదైంది. అంతకు ముందు ఏడాది ఇది 337 మిలియన్ డాలర్లుగా ఉంది. గడిచిన 2020వ సంవత్సరంలో ఫైజర్ 9.6 బిలియన్ డాలర్ల లాభాలు నమోదు చేసింది.

ఫైజర్ తయారు చేసిన కరోనా టీకా గత ఏడాది చివర్లో సంబంధిత అధికారుల నుండి ఆమోదం పొందడం ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఫలితంగా ఈ ఏడాదిలో మరిన్ని ఆర్డర్లు వచ్చి టీకా పంపిణీ 2 బిలియన్ మోతాదుల వరకు సరఫరా చేయగలమని ఫైజర్ తెలిపింది. కాగా, ‘ఫైజర్’ ప్రపంచంలోని అతిపెద్ద ఔషద తయారీ సంస్థలలో ఒకటి. 2020 ఫార్చ్యూన్ 500 జాబితాలో స్థానం సంపాదించిన ఫైజర్, అతిపెద్ద యు.ఎస్. కార్పొరేషన్ల జాబితాలో 64 వ స్థానంలో ఉంది.