AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adolf Hitler: వేలానికి హిట్లర్‌ వాడిన టాయిలెట్‌ సీట్‌.. రూ.10 లక్షలకుపైగానే పలుకుతుందని అంచనా..

హిట్లర్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. వివరాల్లోకి వెళితే.. హిట్లర్‌ బతుకున్న సమయంలో ఉపయోగించిన టాయిలెట్‌ సీట్‌ను ప్రస్తుతం వేలానికి ఉంచనున్నారు. దీనికి సంబంధించిన వేలం ఈ నెల...

Adolf Hitler: వేలానికి హిట్లర్‌ వాడిన టాయిలెట్‌ సీట్‌.. రూ.10 లక్షలకుపైగానే పలుకుతుందని అంచనా..
Narender Vaitla
|

Updated on: Feb 03, 2021 | 5:41 AM

Share

Adolf Hitler’s Toilet Seat In Auction: ప్రపంచాన్ని గడగడలాడించిన అడాల్ఫ్‌ హిట్లర్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తన నియంత పోకడలతో ప్రపంచాన్ని భయపెట్టిన హిట్లర్‌ చివరికి ఆత్మహత్య చేసుకొని తనువు చాలించాడు. ఇప్పటికీ ఎవరైనా నియంతలా పాలిస్తుంటే హిట్లర్‌లా ఉంది పాలనా.. అంటూ విమర్శిస్తుంటారు. హిట్లర్‌ ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లి.. 76 ఏళ్లు గడుస్తోన్నా అడపాదడపా ఆయన ప్రస్తావన వస్తూనే ఉంటుంది.

ఇదే క్రమంలో హిట్లర్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. వివరాల్లోకి వెళితే.. హిట్లర్‌ బతుకున్న సమయంలో ఉపయోగించిన టాయిలెట్‌ సీట్‌ను ప్రస్తుతం వేలానికి ఉంచనున్నారు. దీనికి సంబంధించిన వేలం ఈ నెల 8వ తేదీన అమెరికాలోని మేరీల్యాండ్‌లో జరగనుంది. ‘అలెగ్జాండర్‌ ఆక్షన్స్‌’ అనే సంస్థ ఈ వేలం పాటను నిర్వహించనుంది. దీని ప్రారంభ ధరను 5వేల డాలర్లుగా నిర్ణయించారు. ఇక ఈ టాయిలెట్‌ సీటు 15000 డాలర్లకు అమ్ముడుపోతుందని సదరు సంస్థ అంచనా వేస్తోంది. అంటే మన కరెన్సీలో రూ.10 లక్షలకుపైమాటే అన్నమాట. హిట్లర్‌ జర్మనీకి చెందిన వ్యక్తి అయితే.. అతను వాడిన టాయిలెట్‌ సీట్‌ అమెరికాకు ఎలా వెళ్లిందని ఆలోచిస్తున్నారా..? అయితే చరిత్రలోకి వెళ్లాల్సిందే. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో జర్మనీలోని బెర్​చ్టేస్ ​గాడెన్​లో ఉన్న హిట్లర్ ప్రైవేట్ బాత్​రూమ్‌లో ఉన్న టాయ్‌లెట్‌ సీటును అమెరికాకు చెందిన సైనికుడు రాంగ్​వాల్డ్​ సి బోర్చ్ దొంగతనం చేశాడు. బొవారియన్ రిట్రీస్ సమయంలో హిట్లర్ ఇంటిని సాయుధ దళాలు చుట్టుముట్టగా ఆ సమయంలో అదే అదునుగా అతడు టాయ్​లెట్​ సీట్​ను ఎత్తుకెళ్లి న్యూజెర్సీలోని తన ఇంటికి తీసుకెళ్లాడు. ఏళ్లుగా అది అతడి ఇంటి పునాది​​లోనే ఉంది. ఇప్పుడు ఆ సీటును ఆ సైనికుడి కుటుంబస‌భ్యులే వేలానికి పెట్టారు. దీంతో ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఆ టాయిలెట్‌ సీటు వార్తల్లోకెక్కింది.

Also Read:  Kim Jong Un’s Wife Missing: ఏడాది కాలంగా కనిపించని కిమ్ భార్య సోల్ జు, ఎక్కడికి వెళ్లినట్టు ? ఎన్నో ఊహాగానాలు.

కొత్త ఏడాదిలో మొబైల్‌ రీఛార్జ్‌ ధరలు పెరగనున్నాయా..?
కొత్త ఏడాదిలో మొబైల్‌ రీఛార్జ్‌ ధరలు పెరగనున్నాయా..?
చీరలో అందంగా రెజీనా.. బ్యూటిఫుల్ ఫొటోస్ వైరల్
చీరలో అందంగా రెజీనా.. బ్యూటిఫుల్ ఫొటోస్ వైరల్
సర్పంచ్ ఎన్నికల బరిలోకి సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని..
సర్పంచ్ ఎన్నికల బరిలోకి సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని..
మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!