AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: పసిడి ప్రియులకు బ్యాడ్‌న్యూస్‌… మళ్లీ పరుగులు పెడుతున్న బంగారం ధరలు

Gold Rate Today: దేశంలో బంగారం ధరలకు రెక్కలొస్తున్నాయి. పసిడి ధరల్లో తగ్గుముఖం పట్టగా, ఇటీవల నుంచి ఎగబాకుతోంది. అయితే బంగారం ధరపై ప్రభావం...

Gold Price Today: పసిడి ప్రియులకు బ్యాడ్‌న్యూస్‌... మళ్లీ పరుగులు పెడుతున్న బంగారం ధరలు
Gold Price
Subhash Goud
|

Updated on: Apr 18, 2021 | 4:45 AM

Share

Gold Rate Today: దేశంలో బంగారం ధరలకు రెక్కలొస్తున్నాయి. పసిడి ధరల్లో తగ్గుముఖం పట్టగా, ఇటీవల నుంచి ఎగబాకుతోంది. అయితే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు పసిడి రేటుపై ప్రభావం చూపుతాయని గమనించాలి. తాజాగా బంగారం ధర పెరిగింది. అయితే ఒక్కో ప్రాంతంలో ఒక్క విధంగా ఉంటుంది. శనివారం ఉదయం బంగారం ధరలను పరిశీలిస్తే ఢిల్లీలో 10 గ్రాములపై రూ.300 వరకు పెరిగింది. ఇక దేశ వ్యాప్తంగా ధరల వివరాలను పరిశీలిస్తే..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,300 ఉంది.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,950 ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,190 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,200 ఉంది.

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,190 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,900 ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000 ఉంది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44, 000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000 ఉంది.

కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000వద్ద ఉంది.

పుణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,950 ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000 ఉంది.

విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000 ఉంది.

కాగా, గత పదిహేను రోజుల్లో ధరలు దేశీయ మార్కెట్‌లో 6 శాతం, అంతర్జాతీయ మార్కెట్లో 4 శాతం పెరిగాయి. ప్రస్తుతం ఏకంగా 1775 డాలర్లను క్రాస్‌ చేసి 1800 డాలర్ల దిశగా పరుగెడుతోంది. కరోనా కారణంగా 2020 ఆగస్టులో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ పసిడి 2072, దేశీయ మార్కెట్లో రూ.56200 పలికింది. ఆ తర్వాత పతనమైనప్పటికీ, మళ్లీ ధరలు ఎగిసిపడుతున్నాయి.

ఇవీ చదవండి: SBI Insurance: కస్టమర్లకు శుభవార్త.. ఎస్‌బీఐ లైఫ్‌ సంపూర్ణ్‌ సురక్ష పాలసీ.. రూ.40 లక్షల లైఫ్‌ కవరేజీతో ఇన్సూరెన్స్‌

Covid-19: కరోనా నుంచి రక్షించుకునేందుకు కొత్త పాలసీలు..5 లక్షల వరకు కవరేజీ.. ప్రీమియం ఎంతంటే..!