AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలివిమీరిపోయారు.. విమానం టాయిలెట్‌లో ఇదేం పని.. అధికారులే బిత్తరపోయారు..

స్మగ్లర్లు కొత్త కొత్త పద్ధతులతో అధికారులను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా దుబాయ్ నుంచి అహ్మదాబాద్ వచ్చిన విమానం టాయిలెట్ స్పీకర్లలో దాచిన 24 బంగారు బిస్కెట్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 2.799 కిలోల బంగారం విలువ రూ.4.26 కోట్లకు పైగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. విమానంలోని టాయిలెట్‌లోని స్పీకర్ల వెనుక భాగంలో బంగారాన్ని దాచడం అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది.

తెలివిమీరిపోయారు.. విమానం టాయిలెట్‌లో ఇదేం పని.. అధికారులే బిత్తరపోయారు..
Airplane Bathroom
Shaik Madar Saheb
|

Updated on: Jun 13, 2026 | 7:31 AM

Share

స్మగ్లర్లు తెలివిమీరిపోయారు. అధికారులు ఎప్పటికప్పుడు వారిని కట్టడి చేస్తున్నా.. కొత్త కొత్త పద్ధతుల్లో బంగారాన్ని తరలిస్తున్నారు. లేటెస్ట్‌గా దుబాయ్‌ నుంచి అహ్మదాబాద్ వచ్చిన విమానం టాయిలెట్ స్పీకర్లలో బంగారం బయటపడటం అధికారులు సైతం ఆశ్చర్యపోయేలా చేస్తోంది. అహ్మదాబాద్‌లోని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు పెద్ద ఎత్తున బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఒక విమానం నుంచి 4.26 కోట్ల రూపాయల పైగా విలువైన 2 వేల 799 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా స్మగ్లింగ్‌కు సంబంధించిన ఒక కొత్త పద్ధతి బయటపడింది. కస్టమ్స్ అధికారులు దుబాయ్ నుంచి వచ్చిన విమానంలో సోదాలు నిర్వహించిన సమయంలో టాయిలెట్‌లో రెండు అనుమానాస్పద పౌచ్‌లు దొరికాయి. ఆ పౌచ్‌లు తెరిచి చూడగా, వాటిలో 24 బంగారు బిస్కెట్లు లభించాయి. వీటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ సరికొత్త స్మగ్లింగ్ పద్ధతి అధికారులకు సవాల్ విసిరింది. సాధారణంగా స్మగ్లర్లు ప్రయాణికుల సీట్ల కింద లేదా వారి లగేజీలో బంగారాన్ని దాచడానికి ప్రయత్నిస్తారు. విమానంలోని టాయిలె స్పీకర్లలో బంగారు బిస్కెట్లను దాచడాన్ని ఎవరూ ఊహించలేదు. ఈ బంగారం తమదే అని ఎవరూ క్లెయిమ్ చేయకపోవడంతో.. ఇది ఎవరి పని అని తెలుసుకునే దిశగా అధికారులు విచారణ మొదలుపెట్టారు. విమానంలో ఈ బంగారాన్ని ఎవరు పెట్టారు, దాని ఉద్దేశం ఏమిటి అనే విషయాలను కనుగొనే దిశగా దర్యాప్తు చేస్తున్నారు.

వీడియో చూడండి..

విమాన కాక్‌పిట్ సమీపంలో అమర్చిన సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించడం ద్వారా ఈ బంగారు బిస్కెట్లను ఎవరు తీసుకొచ్చారు.. టాయిలెట్‌లో ఎవరు దాచారు అనే విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు విమానంలో టాయిలెట్‌ను ఉపయోగించిన ప్రయాణికులను గుర్తించేందుకు కస్టమ్స్ శాఖ ప్రయత్నిస్తోంది. దీని ద్వారా నిందితులు దొరికే అవకాశం ఉందని భావిస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
తెలివిమీరిపోయారు.. విమానం టాయిలెట్‌లో ఇదేం పనిరా..? వాటిని చూసి..
తెలివిమీరిపోయారు.. విమానం టాయిలెట్‌లో ఇదేం పనిరా..? వాటిని చూసి..
ఇక వాట్సాప్‌లో మెసేజ్‌లను 2 వారాల ముందు షెడ్యూల్‌ చేసుకోవచ్చు..!
ఇక వాట్సాప్‌లో మెసేజ్‌లను 2 వారాల ముందు షెడ్యూల్‌ చేసుకోవచ్చు..!
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..
బ్రష్ చేసేటప్పుడు మీరు చేసే తప్పులు ఇవే.. వెంటనే ఇలా చేయకపోతే..
బ్రష్ చేసేటప్పుడు మీరు చేసే తప్పులు ఇవే.. వెంటనే ఇలా చేయకపోతే..
ఎన్ని EMIలు చెల్లించకపోతే బ్యాంకు మీ ఇంటిని వేలం వేస్తుంది?
ఎన్ని EMIలు చెల్లించకపోతే బ్యాంకు మీ ఇంటిని వేలం వేస్తుంది?
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే.. తగ్గిందా? పెరిగిందా?
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే.. తగ్గిందా? పెరిగిందా?
Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తికి ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తికి ఛాన్స్..
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..