జూలై 4న గోల్కొండ బోనాలు
తెలంగాణ ఆషాడ మాసం బోనాలకు సర్వం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ బోనాలు జరిగినా మొట్టమొదటి బోనం ఎత్తేది మాత్రం గోల్కొండలోనే. ఇక్కడ ప్రారంభమైన తర్వాతే మిగితాచోట్ల ప్రారంభమవుతుంది. గోల్కొండ శ్రీఎల్లమ్మ జగదాంబిక ఆలయంలో జూలై 4న ప్రారంభమై ప్రతి ఆదివారం, గురువారం బోనాల జాతరను భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఇక్కడకు హైదరాబాద్ నుంచి మాత్రమే కాకుండా రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, జిల్లాలనుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరై అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. […]
తెలంగాణ ఆషాడ మాసం బోనాలకు సర్వం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ బోనాలు జరిగినా మొట్టమొదటి బోనం ఎత్తేది మాత్రం గోల్కొండలోనే. ఇక్కడ ప్రారంభమైన తర్వాతే మిగితాచోట్ల ప్రారంభమవుతుంది. గోల్కొండ శ్రీఎల్లమ్మ జగదాంబిక ఆలయంలో జూలై 4న ప్రారంభమై ప్రతి ఆదివారం, గురువారం బోనాల జాతరను భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు.
ఇక్కడకు హైదరాబాద్ నుంచి మాత్రమే కాకుండా రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, జిల్లాలనుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరై అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. జూలై 4నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు గోల్కొండ కోటలో బోనాల సందడి కనిపిస్తుంది. జూలై 21,22వ తేదీల్లో సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాలు ప్రారంభమవుతాయి. జూలై 27,28వ తేదీల్లో పాతబస్తీలో బోనాలు నిర్వహించనున్నారు.
నిజాం నవాబు కాలంనుంచి ఈ పండగును గోల్కొండలో జరపడం ఆనవాయితీగా వస్తోంది. దీనికి నవాబులు సైతం అండగా నిలిచేవారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత బోనాలను రాష్ట్ర పండుగగా గుర్తించింది ప్రభుత్వం. బోనాల పండుగ దృష్ట్యా ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు నగర పోలీసులు. మరోవైపు ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా సీసీ కెమెరాలతో నిఘాను పటిష్టం చేస్తున్నారు.