ఇక వారానికి ఐదురోజులు అక్కడే..

వారానికి ఐదురోజుల పాటు పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండనున్నారు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు. ఇప్పటికే రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి ఘోరంగా ఉన్న దృష్ట్యా పార్టీని దగ్గరుండి పర్యవేక్షించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. జూలై 1 సోమవారం నుంచి గుంటూరు రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి కార్యకలాపాలను దగ్గరుండి చంద్రబాబు పర్యవేక్షించనున్నారు. చంద్రబాబు తాజా నిర్ణయంతో టీడీపీ వర్గాల్లో కాస్త ఊరట కలిగిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అక్రమ కట్టడాల కూల్చివేతల పేరుతో ప్రజావేదిక కూల్చివేత, చంద్రబాబు ఇంటికి […]

ఇక వారానికి ఐదురోజులు అక్కడే..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 29, 2019 | 8:50 PM

వారానికి ఐదురోజుల పాటు పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండనున్నారు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు. ఇప్పటికే రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి ఘోరంగా ఉన్న దృష్ట్యా పార్టీని దగ్గరుండి పర్యవేక్షించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. జూలై 1 సోమవారం నుంచి గుంటూరు రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి కార్యకలాపాలను దగ్గరుండి చంద్రబాబు పర్యవేక్షించనున్నారు. చంద్రబాబు తాజా నిర్ణయంతో టీడీపీ వర్గాల్లో కాస్త ఊరట కలిగిందనే వార్తలు వినిపిస్తున్నాయి.

అక్రమ కట్టడాల కూల్చివేతల పేరుతో ప్రజావేదిక కూల్చివేత, చంద్రబాబు ఇంటికి నోటీసులు ఇవ్వడం ఆపార్టీలో కలకలం రేపింది. ఈ నేపధ్యంలో చంద్రబాబు పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపేలా వారికి అందుబాటులో ఉండాలని నిర్ణయించుకున్నట్టుగా సమాచారం.

ఇటీవల ఆపార్టీ సీనియర్లు సైతం సభ్యత్వానికి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోతున్నారు. ఈ పరిస్థితిలో పార్టీని కాపాడుకోవాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. అయితే టీడీపీ నేతలపై అధికార వైసీపీ కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తున్నారు ఆపార్టీ నేతలు.