AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో కారు జోరు.. ఓట్ల కోసం మతవిద్వేషాలు రెచ్చగొడుతున్నారన్న కేటీఆర్.. ప్రశాంత వాతావరణంలో చిచ్చు పెట్టవద్దని పిలుపు

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రచారంలో టీఆర్ఎస్ దూసుకుపోతుంది. గ్రేటర్ గెలుపు బాధ్యతలను భుజాన వేసుకున్న మంత్రి కేటీ.రామారావు ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో కారు జోరు.. ఓట్ల కోసం మతవిద్వేషాలు రెచ్చగొడుతున్నారన్న కేటీఆర్.. ప్రశాంత వాతావరణంలో చిచ్చు పెట్టవద్దని పిలుపు
Balaraju Goud
|

Updated on: Nov 24, 2020 | 9:28 PM

Share

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రచారంలో టీఆర్ఎస్ దూసుకుపోతుంది. గ్రేటర్ గెలుపు బాధ్యతలను భుజాన వేసుకున్న మంత్రి కేటీ.రామారావు ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో అభ్యర్థుల విజయానికి బాటలు వేస్తున్నారు. ఇదే క్రమంలో వరుస రోడ్ షోలు నిర్వహిస్తూ పార్టీ స్టాండ్ ను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. అటు ప్రతిపక్షాల కామెంట్లకు కౌంటర్లు ఇస్తూ చేసిన అభివృద్ధిని ప్రజల ముందుంచుతున్నారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాగంగా అంబర్‌పేట్‌ నియోజకవర్గం రోడ్‌షోలో కేటీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. ఆరేళ్లలో జరిగిన అభివృద్ధిని ప్రజల ముందు ఉంచాల్సిన బాధ్యత మాపై ఉందని మంత్రి కేటీఆర్‌ గుర్తు చేశారు. తెలంగాణ నాయకులకు పరిపాలన రాదని గతంలో హేళన చేసిన వారి నోర్లు మూయించామన్నారు. ఆరేళ్లుగా ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో మతవిద్వేషాలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.

అభివృద్ధి సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దూసుకెళ్తోంది. తెలంగాణ, హైదరాబాద్‌ ప్రశాంతంగా ఉంది. కరోనా నియంత్రణ రాష్ట్ర సర్కార్ సమర్థవంతంగా ఎదుర్కొందన్నారు. లాక్ డౌన్ కారణంగా ఆర్థిక సంక్షోభ సమయంలో నగరవాసుల పరిస్థితులను అర్థం చేసుకుని ఆస్తి పన్నును ప్రభుత్వం 50శాతం మాఫీ చేసిందన్నారు కేటీఆర్. పేదల వైద్యం కోసం బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశాం. కేసీఆర్‌ కిట్‌ వంటి అనేక పథకాలు అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. కులం, మతంతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. మతం కాదు..జనహితం అనేది కేసీఆర్‌ నినాదమని మరోసారి స్పష్టం చేశారు కేటీఆర్. హైదరాబాద్‌లో కేంద్ర ప్రభుత్వం ఒక్క అభివృద్ధి చేసిందా? గుజరాత్‌, యూపీ రాష్ట్రాల్లో అభివృద్ధి పనుల్లో తెలంగాణ వాటా ఉందన్నారు. హైదరాబాద్‌లో వరదలు వస్తే ఇప్పటి వరకు ఆర్థిక సాయం చేయలేదని’ కేటీఆర్‌ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద మనస్సు చేసుకుని వరద బాధిత కుటుంబాలకు పది వేలు ఇస్తుంటే.. ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయన్నారు. జన సమస్యల్లో ఉన్నప్పుడు కనిపించని నేతలు.. ఓట్ల అనే సరికి ఢిల్లీ నుంచి గల్లీకి దిగివస్తున్నారని ఆరోపించారు. విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని హైదరాబాద్ వాసులు ఆదరించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.