జీహెచ్ఎంసీ ఎన్నికలు : మాదాపూర్ లో ఉద్రిక్తత .. టీఆర్ఎస్- బీజేపీ నాయకుల మధ్య వాగ్వాదం

జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది.  పలు చోట్ల టీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. ఇక పోలింగ్ లో భాగంగా మాదాపూర్‌లో టీఆర్ఎస్ నాయకులు దొర్జన్యానికి పాల్పడుతున్నారని స్థానిక బీజేపీ నేతలు ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు.

జీహెచ్ఎంసీ ఎన్నికలు : మాదాపూర్ లో ఉద్రిక్తత .. టీఆర్ఎస్- బీజేపీ నాయకుల మధ్య వాగ్వాదం
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 01, 2020 | 1:01 PM

జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. పలుచోట్ల టీఆర్ఎస్- బీజేపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి.  పోలింగ్ లో భాగంగా మాదాపూర్‌లో టీఆర్ఎస్ నాయకులు దొర్జన్యానికి పాల్పడుతున్నారని స్థానిక బీజేపీ నేతలు ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. పోలీసుల సాయంతో పోలింగ్ బూత్ లో ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు. దాంతో టీఆర్ఎస్ బీజీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. టీఆర్ఎస్ నాయకులకు మాదాపూర్ పోలీసులు సాయం చేస్తున్నారంటూ బీజేపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య మాటల యుద్ధం జరిగింది. దాంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.