GHMC Election Results 2020: అల్వాల్ డివిజన్‌ను కైవసం చేసుకున్న టీఆర్‌ఎస్.. 1050 ఓట్లతో విజయం సాధించిన అభ్యర్థి
జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాల్లో దూసుకెళుతుంది. అలాగే బీజేపీ, ఎంఐఎం పార్టీలు కూడా అందుకు తగ్గట్లుగా పోటీని ఇస్తున్నాయి.

జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాల్లో దూసుకెళుతుంది. అలాగే బీజేపీ, ఎంఐఎం పార్టీలు కూడా అందుకు తగ్గట్లుగా పోటీని ఇస్తున్నాయి. కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. తాజాగా 134 అల్వాల్ డివిజన్‌లో టీఆర్‌ఎస్ 1050 ఓట్లతో విజయం సాధించింది. దీంతో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ 71 స్థానాల్లో, బీజేపీ 37, ఎంఐఎం 37, కాంగ్రెస్ 3 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నాయి. పలు కౌంటింగ్ కేంద్రాల దగ్గర చెదురు మదురు ఘటనలు జరుగుతున్నా.. కౌంటింగ్ మాత్రం ప్రశాంతంగానే జరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రభస.. ఐదవ రోజూ కొనసాగిన సస్పెన్షన్ల పర్వం.. 10 మంది టీడీపీ సభ్యులపై వేటు..
