ఎన్నికల విధులకు, శిక్షణకు డుమ్మా కొట్టే వారికి జీహెచ్ఎంసీ కమిషనర్ షాక్.. షోకాజ్ నోటీసులు జారీ
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల నిర్వహణ కోసం నియమించిన సిబ్బందికి జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి లోకేశ్ కుమార్ షాకిచ్చారు. మంగళవారం (నవంబర్ 24న) నిర్వహించిన...
GHMC commissioner shocks election staff: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల నిర్వహణ కోసం నియమించిన సిబ్బందికి జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి లోకేశ్ కుమార్ షాకిచ్చారు. మంగళవారం (నవంబర్ 24న) నిర్వహించిన పోలింగ్ శిక్షణ శిబిరానికి గైర్హాజరు అయిన వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అదే సమయంలో ఎన్నికల విధులను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.
మంగళవారం నిర్వహించిన శిక్షణకు గైర్హాజరైన ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు షోకాజు నోటీసులు జారీచేస్తున్నట్టు జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి లోకేశ్ కుమార్ తెలియజేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణ కోసం పిఓ, ఏపిఓ విధులు నిర్వహించే ఉద్యోగులకు ఎన్నికల విధుల ఉత్తర్వులు జారీచేయగా, మంగళవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి కొంత మంది హాజరు కాలేదు. దాంతో గైర్హాజరైన వారికి నోటీసులు జారీచేశామని తెలిపారు.
కాగా హాజరుకాని ఉద్యోగులకు మరో అవకాశంగా బుధవారం 25వ తేదీన మరోసారి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎన్నికల శిక్షణకు హాజరుకానివారు, తమకు కేటాయించిన శిక్షణ కేంద్రంలో 25వ తేదీన తప్పనిసరిగా హాజరుకావాలని అన్నారు. ఎన్నికల విధుల నుండి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ జీహెచ్ఎంసీ కార్యాలయానికి వస్తున్నారని, ఎట్టి పరిస్థితులోనూ మినహాయింపు ఇవ్వడం కుదరదని స్పష్టం చేశారు. ఎన్నికల విధులకు హాజరుకానివారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు చేపట్టనున్నట్టు జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి డి.ఎస్.లోకేష్ కుమార్ వెల్లడించారు.
ALSO READ: ఏపీలో ఆస్తిపన్ను విధానంలో సమూల మార్పులు..
ALSO READ: కరోనా వ్యాక్సిన్ పంపిణీపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు..