Hyderabad: మంచినీళ్లు, ఉచితంగా భోజనం.. గణేష్‌ నిమజ్జనానికి జీహెచ్ఎంసీ ఏర్పాట్లు పూర్తి..

హైదరాబాద్‌లో ఈనెల 17 న జరిగే గణేష్‌ నిమజ్జనానికి ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. హుస్సేన్‌సాగర్‌ సహా GHMC పరిధిలోని భారీ చెరువులు, ప్రత్యేకంగా కొలనులు ఏర్పాటు చేశారు.

Hyderabad: మంచినీళ్లు, ఉచితంగా భోజనం.. గణేష్‌ నిమజ్జనానికి జీహెచ్ఎంసీ ఏర్పాట్లు పూర్తి..
Ghmc Commissioner Amrapali
Follow us

| Edited By: Basha Shek

Updated on: Sep 15, 2024 | 7:35 AM

హైదరాబాద్‌లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈనెల 17వ తేదీన హుస్సేన్‌సాగర్‌లో జరిగే మహాగణపతి నిమజ్జనానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. జంట నగరాల్లో 11 రోజులపాటు నవరాత్రి పూజలు అందుకున్న గణనాథుడు నిమజ్జనానికి లక్షలమంది భక్తులు తరలివస్తారు. గణేషుల నిమజ్జనంతోపాటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని GHMC కమిషనర్‌ ఆమ్రపాలి తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఐదు పెద్ద చెరువులతో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నీటి కొలనులలో నిమజ్జనం చేయాలని ఆమె సూచించారు. మొత్తం 140 స్టాటిక్ క్రేన్లు, 295 మొబైల్ క్రేన్లు, 102 మినీటిప్పర్లు, జేసీబీలు, యాక్షన్ టీమ్స్ సిద్ధం చేశామన్నారు. 15 వేల మంది జీహెచ్‌ఎంసీ సిబ్బంది నిమజ్జనం విధుల్లో ఉంటారని వెల్లడించారు.

ట్యాంక్‌బండ్‌తో సహా పలు ముఖ్యమైన చెరువుల వద్ద శానిటేషన్ సిబ్బంది, గజఈతగాళ్లను కూడా ఏర్పాటు చేసినట్టు చెప్పారు. గణేషుడి నిమజ్జనానికి తరలివచ్చే భక్తుల కోసం ట్యాంక్‌ బండ్‌, సరూర్‌నగర్‌ ప్రాంతాల్లో GHMC తరఫున మంచినీళ్లు, ఉచితంగా భోజనం కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. గతంలో నిమజ్జనాల వేళ జరిగిన అనుభవాలను పరిగణలోకి తీసుకుని.. ఈసారి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

నిమజ్జనానికి వచ్చే ప్రధాన రహదారులు, వీధుల్లో స్ట్రీట్‌లైట్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. గణేష్ నిమజ్జనానికి జోనల్ కమిషనర్లతో పాటు పోలీస్‌శాఖ అధికారులు సమన్వయం చేసుకుంటూ పనిచేస్తారన్నారు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి. మొత్తానికి ఎక్కడా..ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈసారి జీహెచ్ఎంసీ ముందుగానే అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గణేష్‌ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి.. ఆమ్రపాలి కీలక ప్రకటన..
గణేష్‌ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి.. ఆమ్రపాలి కీలక ప్రకటన..
ఆఖరి సినిమాకు విజయ్ అద్దిరిపోయే రెమ్యునరేషన్.. ఏకంగా అన్ని కోట్లే
ఆఖరి సినిమాకు విజయ్ అద్దిరిపోయే రెమ్యునరేషన్.. ఏకంగా అన్ని కోట్లే
మళ్లీ నిరాశే.. ప్లాన్‌-C కూడా ఫెయిల్‌.. ఆపరేషన్‌కు బ్రేక్..
మళ్లీ నిరాశే.. ప్లాన్‌-C కూడా ఫెయిల్‌.. ఆపరేషన్‌కు బ్రేక్..
'లా' ప్రవేశాలకు చివరి అవకాశం.. 17 నుంచి Lawcet ఫైనల్ కౌన్సెలింగ్‌
'లా' ప్రవేశాలకు చివరి అవకాశం.. 17 నుంచి Lawcet ఫైనల్ కౌన్సెలింగ్‌
ఫ్లిప్‌కార్ట్ సేల్ వస్తోంది..ఈ 24 స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపు
ఫ్లిప్‌కార్ట్ సేల్ వస్తోంది..ఈ 24 స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపు
ఓటీటీలో రాజ్ తరుణ్,మాల్వీ మల్హోత్రా ప్రేమకథ..స్ట్రీమింగ్ డేట్ ఇదే
ఓటీటీలో రాజ్ తరుణ్,మాల్వీ మల్హోత్రా ప్రేమకథ..స్ట్రీమింగ్ డేట్ ఇదే
ఈఏడాది CBSE టెన్త్ విద్యార్థులకు రాష్ట్రబోర్డు పరీక్షలే..ఎందుకంటే
ఈఏడాది CBSE టెన్త్ విద్యార్థులకు రాష్ట్రబోర్డు పరీక్షలే..ఎందుకంటే
మళ్లీ రూ.75 వేలకు చేరుకున్న బంగారం..లక్ష దగ్గరలో వెండి
మళ్లీ రూ.75 వేలకు చేరుకున్న బంగారం..లక్ష దగ్గరలో వెండి
కానిస్టేబుల్ శారీరక సామర్థ్య పరీక్షలకు అడ్మిట్‌కార్డులు విడుదల
కానిస్టేబుల్ శారీరక సామర్థ్య పరీక్షలకు అడ్మిట్‌కార్డులు విడుదల
మిక్డ్స్ వెజిటేబుల్ పకోడీ.. తిన్నారంటే మళ్లీ ఇలానే చేస్తారు..
మిక్డ్స్ వెజిటేబుల్ పకోడీ.. తిన్నారంటే మళ్లీ ఇలానే చేస్తారు..
కుక్క బాధితులకు క్షమాపణ చెప్పి, 25 వేలియ్యాలే|QR కోడ్ తో దోస్తుండ
కుక్క బాధితులకు క్షమాపణ చెప్పి, 25 వేలియ్యాలే|QR కోడ్ తో దోస్తుండ
‘నా దుర్గ న్యాయం అడుగుతోంది’ ఆవేదనతో వైద్యురాలి స్నేహితుడి కవిత.!
‘నా దుర్గ న్యాయం అడుగుతోంది’ ఆవేదనతో వైద్యురాలి స్నేహితుడి కవిత.!
డ్రైవర్‌ లేకుండానే కూత పెట్టనున్న ట్రైన్‌.! జనాభా తగ్గిపోతుండటమే
డ్రైవర్‌ లేకుండానే కూత పెట్టనున్న ట్రైన్‌.! జనాభా తగ్గిపోతుండటమే
సాహస వీరులకు సలాం.. టీవీ9 అన్ సంగ్ హీరోస్.. లైవ్ వీడియో
సాహస వీరులకు సలాం.. టీవీ9 అన్ సంగ్ హీరోస్.. లైవ్ వీడియో
ఓలా షోరూమ్‌ను తగలబెట్టిన యువకుడు.. ఎందుకో తెలుసా.?
ఓలా షోరూమ్‌ను తగలబెట్టిన యువకుడు.. ఎందుకో తెలుసా.?
మరోసారి రెయిన్ అలర్ట్.! ఈ ప్రాంతాల్లో వర్షాలు..
మరోసారి రెయిన్ అలర్ట్.! ఈ ప్రాంతాల్లో వర్షాలు..
అర్థరాత్రి పోలీసులను పరుగులు పెట్టించిన ఎలుకలు.! ఎందుకో తెలుసా.?
అర్థరాత్రి పోలీసులను పరుగులు పెట్టించిన ఎలుకలు.! ఎందుకో తెలుసా.?
ఈ ఆకుకూర తింటే ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదలరు.!
ఈ ఆకుకూర తింటే ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదలరు.!
ఓర్నీ.. దానిమ్మ ఆకుల్లో ఇంత శక్తి ఉందా? ఔషధంలా దానిమ్మ..
ఓర్నీ.. దానిమ్మ ఆకుల్లో ఇంత శక్తి ఉందా? ఔషధంలా దానిమ్మ..
పాకిస్తాన్‌లో భూకంపం.. ఢిల్లీలోనూ భూ ప్రకంపనలు.!
పాకిస్తాన్‌లో భూకంపం.. ఢిల్లీలోనూ భూ ప్రకంపనలు.!