AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మైనర్ బాలికల అక్రమ రవాణా కేసులో గెస్లిన్ మెక్స్ వెల్ అరెస్ట్

మైనర్ బాలికల అక్రమ రవాణా లైంగిక కేసుకు సంబంధించి గెస్లిన్ మ్యాక్స్ వెల్ ను ఎఫ్ బీ ఐ పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యాపారవేత్త జెఫ్రీ ఎపీస్టిన్ కోసం చిన్న వయస్సు కలిగిన బాలికలను సరఫరా చేసేందుకు సహాయం చేసిన ఆరోపణలపై బ్రిటిష్ పోలీసులు మ్యాక్స్ వెల్ ను గురువారం అదుపులోకి తీసుకున్నారు.

మైనర్ బాలికల అక్రమ రవాణా కేసులో గెస్లిన్ మెక్స్ వెల్ అరెస్ట్
Balaraju Goud
|

Updated on: Jul 03, 2020 | 3:10 PM

Share

మైనర్ బాలికల అక్రమ రవాణా లైంగిక కేసుకు సంబంధించి గెస్లిన్ మ్యాక్స్ వెల్ ను ఎఫ్ బీ ఐ పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యాపారవేత్త జెఫ్రీ ఎపీస్టిన్ కోసం చిన్న వయస్సు కలిగిన బాలికలను సరఫరా చేసేందుకు సహాయం చేసిన ఆరోపణలపై బ్రిటిష్ పోలీసులు మ్యాక్స్ వెల్ ను గురువారం అదుపులోకి తీసుకున్నారు.

ఎపీస్టిన్ విదేశీ పర్యటనల సందర్భంగా తరచూ ప్రయాణ సహచరుడిగా ఉన్న మ్యాక్స్ వెల్, 14 ఏళ్ళ వయస్సులోపు ఉన్న బాలికలను పంపింస్తూ ఎపీస్టిన్ కోసం సహాయపడటం ద్వారా ఎపీస్టిన్ నేరాలకు దోహదపడ్డాడని పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, గత వేసవిలో న్యూయార్క్‌లోని ఫెడరల్ డిటెన్షన్ సెంటర్‌లో లైంగిక అక్రమ రవాణా ఆరోపణలపై విచారణ కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఎపీస్టిన్ తనను తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసుకు సంబంధించి విచారణ చేపట్టిన ఎఫ్ బీ ఐ పోలీసులు మ్యాక్స్ వెల్ ను న్యూహాంప్‌షైర్ లో అదుపులోకి తీసుకుని విడియో కాన్పరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపర్చారు.

మ్యాక్స్ వెల్ చాలా యేళ్లు ఎపీస్టిన్ కు సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఎపిస్టిన్ సంబంధించిన వ్యవహారాలను ఆమె చూసుకుంటున్నారు. అయితే, ఎపిస్టిన్ కు మసాజ్ చేయడానికి తమను నియమించుకున్నారని చాలా మంది మైనర్ బాలికలు ఆరోపించారు. ఈ సమయంలో బలవంతంగా లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు ఫిర్యాదు చేశారు. దీంతో చట్టవిరుద్ధమైన లైంగిక చర్యలకు పాల్పడటానికి మైనర్లను ప్రలోభపెట్టడానికి కుట్ర పన్నడంతో పాటు, మైనర్లను అక్రమ రవాణా చేయడానికి కుట్ర చేశారన్న నేరారోపణతో మ్యాక్స్ వెల్ ను అరెస్ట్ చేశారు. ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లోని అతని మాన్హాటన్ భవనంతో పాటు ఇతర నివాసాల వద్ద ఎపీస్టిన్ బాలికలను వేధించాడని కోర్టుకు నివేదించారు పోలీసులు. వీడియో కాన్పరెన్స్ ద్వారా విచారణ చేపట్టింది కోర్టు.