AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సుశాంత్‌, దిశ ఆత్మహత్యలు: వెలుగులోకి షాకింగ్ విషయాలు

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మరణించి 18 రోజులు అవుతున్నా.. అతడి మృతిని సన్నిహితులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

సుశాంత్‌, దిశ ఆత్మహత్యలు: వెలుగులోకి షాకింగ్ విషయాలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 03, 2020 | 4:10 PM

Share

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మరణించి 18 రోజులు అవుతున్నా.. అతడి మృతిని సన్నిహితులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదని, చంపేశారని పలువురు సోషల్ మీడియాలో చెబుతూ వస్తున్నారు. ఈ కేసులో బాలీవుడ్‌లోని పెద్దవారు ఇన్వాల్వ్ అయ్యారని.. సుశాంత్ మృతిని సీబీఐకి అప్పగించాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు.

కాగా ఈ కేసులో తాజాగా సల్మాన్‌ ఖాన్‌, సూరజ్ పంచోలీ పేర్లు వెలుగులోకి వచ్చాయి. సుశాంత్ బతికి ఉన్పప్పుడు సూరజ్ విషయంలో సల్మాన్‌, అతడికి వార్నింగ్ ఇచ్చాడని.. ఆ తరువాతనే పలు నిర్మాణ సంస్థలు సుశాంత్‌ని బ్యాన్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇక తాజాగా సుశాంత్‌కి, సూరజ్‌కి ఎక్కడ గ్యాప్‌ వచ్చిందన్న విషయం గురించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సుశాంత్‌ ఆత్మహత్యకు ఐదు రోజుల ముందు ఆయన మాజీ మేనేజర్‌ దిశ సెలైన్ కూడా బలవన్మరణం చేసుకున్న విషయం తెలిసిందే. మలాద్‌లో 14వ ఫ్లోర్ నుంచి దూకి దిశ ఆత్మహత్య చేసుకుంది. కాగా దిశ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు సుశాంత్‌ ఆమెకు అండగా నిలిచారని, ఈ క్రమంలోనే సూరజ్‌తో గొడవ జరిగినట్లు తెలుస్తోంది.

వైరల్‌ అవుతున్న కథనం ప్రకారం.. సూరజ్‌, దిశ రిలేషన్‌లో ఉండగా.. ఆ క్రమంలోనే దిశ గర్భం దాల్చిందట. అయితే గర్భాన్ని తొలగించుకోవాలని సూరజ్‌, దిశకు చెప్పగా.. ఆమె ససేమిరా అందట. ఈ విషయంలో దిశకు సుశాంత్‌ మద్దతిచ్చారట. ఇక ఈ విషయం తెలిసిన సల్మాన్‌, సూరజ్‌కి దూరంగా సుశాంత్‌కి సూచించారట. అంతేకాదు ఈ విషయాన్ని సుశాంత్.. రియాకు, తన స్నేహితుడు సందీప్‌కి చెప్పినప్పుడు నోరు మూసుకొని ఉండమని వారు అతడిని హెచ్చరించారట. అలాగే ఈ క్రైమ్‌లో సందీప్‌కి భాగం ఉందన్న కథనం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా సుశాంత్‌ ఆత్మహత్య కేసును దర్యాప్తు చేస్తోన్న పోలీసులు.. ఇప్పటికే 28 మందిని విచారించారు. మరికొంతమందికి నోటీసులు ఇవ్వనున్న పోలీసులు వారిని విచారించనున్నారు.

https://www.instagram.com/p/CCHLJOZjncA/?utm_source=ig_embed

పనికిరావని పారేస్తున్నారా? ఈ గింజలే ఆరోగ్యానికి శ్రీరామరక్ష!
పనికిరావని పారేస్తున్నారా? ఈ గింజలే ఆరోగ్యానికి శ్రీరామరక్ష!
భూగర్భంలో అతిపెద్ద బంగారు నిధి.. 3400 టన్నుల గోల్డ్‌ గుర్తింపు!
భూగర్భంలో అతిపెద్ద బంగారు నిధి.. 3400 టన్నుల గోల్డ్‌ గుర్తింపు!
అప్పుడెప్పుడో మాయం అయ్యింది.. ఇప్పుడు మెగాస్టార్ మూవీతో ఛాన్స్..
అప్పుడెప్పుడో మాయం అయ్యింది.. ఇప్పుడు మెగాస్టార్ మూవీతో ఛాన్స్..
నారింజ పండ్ల తొక్కలు పడేస్తున్నారా? మీరీ విషయం తెలుసుకోవాల్సిందే
నారింజ పండ్ల తొక్కలు పడేస్తున్నారా? మీరీ విషయం తెలుసుకోవాల్సిందే
దుర్వాసనను స్పాంజ్‌లా పీల్చేస్తుంది.. యాపిల్ చేసే మ్యాజిక్ ఇదే
దుర్వాసనను స్పాంజ్‌లా పీల్చేస్తుంది.. యాపిల్ చేసే మ్యాజిక్ ఇదే
గంగవ్వ శతాయుష్కురాలు.. 101 పడిలోకి అడుగు
గంగవ్వ శతాయుష్కురాలు.. 101 పడిలోకి అడుగు
ఇంట్లో ఎలుకలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా? ఇలా తరిమికొట్టండి!
ఇంట్లో ఎలుకలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా? ఇలా తరిమికొట్టండి!
న్యాయం, ధర్మం, ఖాకీ బుక్ అందరికీ ఒకేలా ఉండాలిః కేటీఆర్
న్యాయం, ధర్మం, ఖాకీ బుక్ అందరికీ ఒకేలా ఉండాలిః కేటీఆర్
క్యాబేజీ వీరికి యమ డేంజర్‌.. తిన్నారో నేరుగా కైలాసానికే!
క్యాబేజీ వీరికి యమ డేంజర్‌.. తిన్నారో నేరుగా కైలాసానికే!
జెట్ స్పీడ్‌లో గోపీచంద్ నయ మూవీ షూటింగ్..
జెట్ స్పీడ్‌లో గోపీచంద్ నయ మూవీ షూటింగ్..