Blackmail: యజమాని గదిలో రహస్య కెమెరా.. ఎఫైర్ వీడియోలతో ఉద్యోగుల బ్లాక్ మెయిల్.. ఆ తర్వాత..
Blackmail boss with affair videos: ఓ వ్యాపారవేత్తను కంపెనీ ఉద్యోగులే బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డారు. యజమాని మహిళతో సన్నిహితంగా ఉండటాన్ని చూసి అతని కేబిన్‌లో కెమెరాను ఏర్పాటు చేశారు. అనంతరం రికార్డయిన ఎఫైర్ క్లిప్‌లను
Blackmail boss with affair videos: ఓ వ్యాపారవేత్తను కంపెనీ ఉద్యోగులే బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డారు. యజమాని మహిళతో సన్నిహితంగా ఉండటాన్ని చూసి అతని కేబిన్‌లో కెమెరాను ఏర్పాటు చేశారు. అనంతరం రికార్డయిన ఎఫైర్ క్లిప్‌లను చూపించి రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలో పోలీసులు ముగ్గురుని అరెస్టు చేశారు. ఈ సంఘటన యూపీ పరిధిలోని ఘజియాబాద్‌లో చోటు చేసింది. ఘజియాబాద్ హిండన్ విహార్ ప్రాంతంలోని ఓ ఫ్యాక్టరీ యజమాని.. అక్కడ పనిచేసే మహిళతో సన్నిహితంగా ఉంటున్నాడు. ఇది గ్రహించిన ఉద్యోగులు.. అతని గదిలో రహస్య కెమెరాను ఏర్పాటు చేశారు. అనంతరం దానిలో రికార్డయిన క్లిప్‌లను యజమానికి పంపించి రూ.25 లక్షలు ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ డబ్బు వ్యవహారం కొన్ని రోజులుగా కొనసాగుతోంది. చివరకు ఆ యజమాని 10లక్షలు ఇస్తానంటూ ఒప్పందం కుదుర్చుకొని.. పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
రంగంలోకి దిగిన పోలీసులు అదే కంపెనీలో పనిచేస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. సిబ్బందిని అపర్ణ త్యాగి, అంకిత్, అరుణ్ ఘోష్లుగా గుర్తించారు. ఈ సంఘటనపై వ్యాఖ్యానిస్తూ ఎస్‌హెచ్‌ఓ నీరజ్ సింగ్ మాట్లాడుతూ.. ఉద్యోగులకు గత కొన్ని నెలలుగా సరిగా జీతం ఇవ్వకపోవడంతో ఈ చర్యకు పునుకున్నట్లు వివరించారు. జీతం ఇవ్వకపోవడం వల్లనే బ్లాక్ మెయిల్ చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారని తెలిపారు. ఈ మేరకు నిందితులపై సెక్షన్ 342, 323, 389 కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచి జైలుకు పంపినట్లు ఘజియాబాద్ పోలీసులు వెల్లడించారు.
Also Read: