గంభీర్ ఆస్తి విలువ ఎంతంటే..!
భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ బీజేపీ పార్టీ తరపున తూర్పు ఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా గంభీర్ తన అఫిడవిట్ లో ఆస్తులు, అప్పుల వివరాలను పొందుపరిచాడు. అఫిడవిట్ ప్రకారం గంభీర్ మొత్తం ఆస్తుల విలువ రూ.147 కోట్లు. తన దగ్గర 5 కార్లు, 2 బైక్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆయన భార్య నటాషాకు రూ.6.15 లక్షల ఆదాయం ఉన్నట్లు చూపించాడు. ఇక 2017-18 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.12.40 […]

భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ బీజేపీ పార్టీ తరపున తూర్పు ఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా గంభీర్ తన అఫిడవిట్ లో ఆస్తులు, అప్పుల వివరాలను పొందుపరిచాడు. అఫిడవిట్ ప్రకారం గంభీర్ మొత్తం ఆస్తుల విలువ రూ.147 కోట్లు. తన దగ్గర 5 కార్లు, 2 బైక్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆయన భార్య నటాషాకు రూ.6.15 లక్షల ఆదాయం ఉన్నట్లు చూపించాడు. ఇక 2017-18 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.12.40 కోట్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు గంభీర్ తన అఫిడవిట్‌లో పొందుపరిచాడు. కాగా ఢిల్లీ బరిలో ఉన్న 349 మంది అభ్యర్థుల్లో గంభీర్ అత్యంత ధనవంతుడు.
