AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాబుకు దూరం.. జగన్‌పైనే విశ్వాసం: గంటా దారెటు?

తెలుగుదేశం పార్టీలో ముసలం మొదలైందా? చంద్రబాబు వైఖరికి భిన్నంగా స్పందిస్తున్న గంటా శ్రీనివాస్ రావు త్వరలో పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు రెడీ అవుతున్నారా? తాజాగా గంటా శ్రీనివాస్ రావు చేసిన ప్రకటన ఆయన భిన్నమైన దారిలో వెళుతున్నారన్న సంకేతాలను గట్టిగా ఇస్తున్నారు. విశాఖలోని వాల్తేర్ క్లబ్ విషయంలో ప్రభుత్వంపై టీడీపీ నేతలు పోరాడుతుంటే.. గంటా మాత్రం జగన్ ప్రభుత్వం వాల్తేర్ క్లబ్ వివాదాన్ని సానుకూలంగా స్పందిస్తుందన్న నమ్మకం తనకుందని ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన […]

బాబుకు దూరం.. జగన్‌పైనే విశ్వాసం: గంటా దారెటు?
Rajesh Sharma
|

Updated on: Jan 31, 2020 | 5:48 PM

Share

తెలుగుదేశం పార్టీలో ముసలం మొదలైందా? చంద్రబాబు వైఖరికి భిన్నంగా స్పందిస్తున్న గంటా శ్రీనివాస్ రావు త్వరలో పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు రెడీ అవుతున్నారా? తాజాగా గంటా శ్రీనివాస్ రావు చేసిన ప్రకటన ఆయన భిన్నమైన దారిలో వెళుతున్నారన్న సంకేతాలను గట్టిగా ఇస్తున్నారు. విశాఖలోని వాల్తేర్ క్లబ్ విషయంలో ప్రభుత్వంపై టీడీపీ నేతలు పోరాడుతుంటే.. గంటా మాత్రం జగన్ ప్రభుత్వం వాల్తేర్ క్లబ్ వివాదాన్ని సానుకూలంగా స్పందిస్తుందన్న నమ్మకం తనకుందని ప్రకటించారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ ఒక వైపు జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతుంటే టీడీపీ నేతలు అందుకు భిన్నంగా స్పందిస్తున్నారు. గంటా శ్రీనివాస్ రావు కూడా వైసీపీ ప్రభుత్వంపై నమ్మకమందంటూ సంచలన కామెంట్ చేశారు. గత కొంత కాలంగా పార్టీకి అంటీముట్టనట్లున్న గంటా.. పార్టీ కార్యక్రమాలకు దూరంగానే వుంటున్నారు.

ముఖ్యంగా మూడు రాజధానుల ప్రస్తావన వచ్చిన తర్వాత గంటా విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విషయంలో సానుకూల వైఖరిని కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన టీడీపీతో తెగదెంపులకు సిద్దమవుతున్నట్లు తాజా ప్రకటన స్పష్టం చేస్తోంది.

విశాఖలోని వాల్తేర్ క్లబ్‌ విషయంలో గత రెండ్రోజులుగా రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. క్లబ్ భూములపై వైసీపీ నేతల కన్ను పడిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. క్లబ్ భూముల్లో టీడీపీ ఆఫీసు నిర్మించుకుందంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాల్తేర్ క్లబ్ మనుగడ ప్రశ్నార్థకంలో పడినట్లయింది.

వాల్తేరు క్లబ్ వివాదంపై స్పందించిన మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ రావు.. శతాబ్ధకాలానికిపైగా చరిత్ర కలిగిన వాల్తేర్ క్లబ్‌ వ్యవహారాన్ని జగన్ ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరిస్తుందన్న నమ్మకం వుందన్నారు గంటా. ‘‘వాల్తేరు క్లబ్ విషయంలో ప్రభుత్వం సానుకూల ఆలోచనాదృక్పథం అవలంభిస్తే మంచిది. వైజాగ్ ప్రాచీన నామం అయిన వాల్తేరు పేరుతో 1883లో ప్రారంభమయినప్పటినుంచి క్లబ్ వైజాగ్ ప్రజల జీవన విధానంలో మమేకమైంది. వైజాగ్ బ్రాండ్‌లో భాగమైంది. అందరికీ ఆహ్లాదాన్ని, ఆతిధ్యాన్ని ఇచ్చే మచ్చికైన ప్రాంతం కావడంతో దీనితో ప్రజలకు అనుబంధం పెరిగింది. ఇందులో వివిధ రంగాలలో ప్రావీణ్యం పొందిన ఎ౦దరో నిపుణులు, దేశ విదేశాలలో తమ తమ రంగాలలో అగ్రస్థానంలో ఉన్న తెలుగు వారు సభ్యులుగా ఉన్నారు. వాల్తేరు క్లబ్‌ను యధాతధంగా ఉంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటే… వైజాగ్ లో మంచి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించి, కృషి చేస్తుందని విశ్వసిస్తున్నాను.’’ అంటూ గంటా స్టేట్‌మెంట్ రిలీజ్ చేశారు.