చైనా, హాంకాంగ్‌ల నుంచి హైదరాబాద్ చేరిన 45 మంది: వైద్య శాఖ అప్రమత్తం

కరోనా వైరస్‌తో హైదరాబాద్‌ నగర వ్యాప్తంగా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. కేంద్రం ఆదేశాల మేరకు కరోనాను ఎదుర్కొనేందుకు రాష్ట్ర స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే పలువురు జ్వరాల బారిన పడ్డారు. అలాగే.. ఈ వైరస్‌ సోకి భారతదేశంలో ఒకరు మరణించారు. తాజాగా.. కరోనా వైరస్‌ లక్షణాలతో బాధపడుతూ ఓ యువకుడు(29) ఫీవర్‌ ఆస్పత్రిలో చేరగా, మియాపూర్‌కు చెందిన మరో వ్యక్తి (39) కూడా గాంధీ ఆస్పత్రిలో చేరాడు. […]

చైనా, హాంకాంగ్‌ల నుంచి హైదరాబాద్ చేరిన 45 మంది: వైద్య శాఖ అప్రమత్తం
Follow us

| Edited By:

Updated on: Jan 31, 2020 | 4:30 PM

కరోనా వైరస్‌తో హైదరాబాద్‌ నగర వ్యాప్తంగా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. కేంద్రం ఆదేశాల మేరకు కరోనాను ఎదుర్కొనేందుకు రాష్ట్ర స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే పలువురు జ్వరాల బారిన పడ్డారు. అలాగే.. ఈ వైరస్‌ సోకి భారతదేశంలో ఒకరు మరణించారు. తాజాగా.. కరోనా వైరస్‌ లక్షణాలతో బాధపడుతూ ఓ యువకుడు(29) ఫీవర్‌ ఆస్పత్రిలో చేరగా, మియాపూర్‌కు చెందిన మరో వ్యక్తి (39) కూడా గాంధీ ఆస్పత్రిలో చేరాడు. దీంతో.. వైద్య శాఖ అప్రమత్తమయ్యింది. బాధితులను కరోనా ఐసోలేషన్‌ వార్డులో అడ్మిట్‌ చేసి వైద్యసేవలు అందిస్తున్నారు. వారి నుంచి రక్త నమూనాలు సేకరించి పుణేలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు.

కాగా.. చైనా, హాంకాంగ్‌ల నుంచి హైదరాబాద్‌కి వచ్చినవారిపై ఆరోగ్య శాఖ ఆరా తీసింది. జనవరి 15 తర్వాత చైనా, హాంకాంగ్‌ నుంచి దాదాపు 45 మంది హైదరాబాద్‌కి చేరుకున్నారు. వీరిని గుర్తించిన తెలంగాణ ఆరోగ్య సంక్షేమ శాఖ అధికారులు.. తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలని నోటీసులు ఇచ్చారు. గాంధీ ఆస్పత్రి వైరాలజీకి రావాలంటూ ఆదేశాలు జారీ చేశారు. చైనా దేశం నుంచి జనవరి 15 తర్వాత వచ్చిన వాళ్ళందరూ సెల్ఫ్‌ ఐసొల్యూషన్‌లో ఉండి సహకరించాలని తెలంగాణ హెల్త్ డిపార్ట్‌మెంట్ రిక్వెస్ట్ చేసింది.

Latest Articles
32 ఏళ్ల క్రితమే ఆ హీరోయిన్ జమల్ కుడు డాన్స్ చేసిందా ?
32 ఏళ్ల క్రితమే ఆ హీరోయిన్ జమల్ కుడు డాన్స్ చేసిందా ?
దీపికతో పెళ్లి ఫొటోలను డిలీట్ చేసిన రణ్‌వీర్ సింగ్.. కారణమిదేనా?
దీపికతో పెళ్లి ఫొటోలను డిలీట్ చేసిన రణ్‌వీర్ సింగ్.. కారణమిదేనా?
810 కిలోల బంగారం తీసుకెళ్తున్న వాహనం రోడ్డుపై బోల్తా.. ఒక్కసారిగా
810 కిలోల బంగారం తీసుకెళ్తున్న వాహనం రోడ్డుపై బోల్తా.. ఒక్కసారిగా
రెండు చేతులూ లేకపోయినా.. బాధ్యతగా ఓటు వేసిన అంకిత్
రెండు చేతులూ లేకపోయినా.. బాధ్యతగా ఓటు వేసిన అంకిత్
మండే ఎండల్లో కూలింగ్ న్యూస్.. ఏపీకి వచ్చే 2 రోజులు వర్షాలు..
మండే ఎండల్లో కూలింగ్ న్యూస్.. ఏపీకి వచ్చే 2 రోజులు వర్షాలు..
గంటల తరబడి ఏసీలో ఉంటున్నారా.? ఈ సమ్యలున్నాయో చెక్‌ చేసుకోండి
గంటల తరబడి ఏసీలో ఉంటున్నారా.? ఈ సమ్యలున్నాయో చెక్‌ చేసుకోండి
RRతో మ్యాచ్..టాస్ ఓడిన ఢిల్లీ.. జట్టులో టీమిండియా సీనియర్ ప్లేయర్
RRతో మ్యాచ్..టాస్ ఓడిన ఢిల్లీ.. జట్టులో టీమిండియా సీనియర్ ప్లేయర్
అమిత్ షా హామీతో మరింత దూకుడుగా అరవింద్!
అమిత్ షా హామీతో మరింత దూకుడుగా అరవింద్!
డీబీటీతో రాజకీయం చేస్తున్నదెవరు? భూ ప్రకంపనలు వైసీపీని తాకాయా?
డీబీటీతో రాజకీయం చేస్తున్నదెవరు? భూ ప్రకంపనలు వైసీపీని తాకాయా?
ఈ వ్యాపారం స్టార్ట్ చేస్తే లక్షలు సంపాదించే అవకాశం.!
ఈ వ్యాపారం స్టార్ట్ చేస్తే లక్షలు సంపాదించే అవకాశం.!