గంజాయి సేల్.. పోలీసుల అదుపులో ఇంజనీరింగ్ స్టూడెంట్!
Ganja Caught In Krishna District: కృష్ణాజిల్లాలోని మైలవరంలో గంజాయి అమ్మకం కలకలం రేపింది. ఓ విద్యార్థి వద్ద గంజాయి ఉందని సమాచారం అందుకున్న పోలీసుల రైడ్ చేయగా.. అఖిల్ అనే విద్యార్థి హాస్టల్ రూమ్‌లో 3 కేజీల గంజాయిను స్వాధీనం చేసుకున్నారు. దీనితో అతన్ని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. నూజివీడులోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్న అఖిల్.. మచిలీపట్నం వాసి అని తెలుస్తోంది. కాగా, మైలవరంలో కొంత కాలంగా విద్యార్థులను లక్ష్యం […]
Ganja Caught In Krishna District: కృష్ణాజిల్లాలోని మైలవరంలో గంజాయి అమ్మకం కలకలం రేపింది. ఓ విద్యార్థి వద్ద గంజాయి ఉందని సమాచారం అందుకున్న పోలీసుల రైడ్ చేయగా.. అఖిల్ అనే విద్యార్థి హాస్టల్ రూమ్‌లో 3 కేజీల గంజాయిను స్వాధీనం చేసుకున్నారు. దీనితో అతన్ని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. నూజివీడులోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్న అఖిల్.. మచిలీపట్నం వాసి అని తెలుస్తోంది.
కాగా, మైలవరంలో కొంత కాలంగా విద్యార్థులను లక్ష్యం చేసుకుని కొందరు గంజాయిని విక్రయిస్తున్నారని పోలీసులు తెలిపారు. చిన్న చిన్న పాకెట్‌లుగా చేసి విద్యార్థులకు, కూలీలకు అమ్ముతున్నట్లు సమాచారం.