సరిలేరు ‘బ్లాక్ బస్టర్‌ కా బాప్‌’‌.. కృష్ణ రియాక్షన్!

‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాపై ప్రముఖ సీనియర్ హీరో కృష్ణ స్పందించారు. ముందుగా ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహేష్ ఈ చిత్రంలో బాగా నటించాడని, సినిమా చాలా ఎంటర్ టైనింగ్‌గా, ఎక్స్ట్రార్డినరీగా ఉందన్నారు.‌ ‘బ్లాక్ బస్టర్‌ కా బాప్‌’‌గా సినిమా ఉందని, అలాగే నిర్మాత కాంప్రమైజ్ అవ్వకుండా డబ్బులు ఖర్చు పెట్టారని, డైరెక్టర్ అనిల్ రావిపూడి ఎక్కడా ఎలాంటి బోర్ కొట్టకుండా సినిమా తీశారని పేర్కొన్నారు. మహేష్ బాబు […]

సరిలేరు 'బ్లాక్ బస్టర్‌ కా బాప్‌'‌.. కృష్ణ రియాక్షన్!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jan 31, 2020 | 2:53 PM

‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాపై ప్రముఖ సీనియర్ హీరో కృష్ణ స్పందించారు. ముందుగా ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహేష్ ఈ చిత్రంలో బాగా నటించాడని, సినిమా చాలా ఎంటర్ టైనింగ్‌గా, ఎక్స్ట్రార్డినరీగా ఉందన్నారు.‌ ‘బ్లాక్ బస్టర్‌ కా బాప్‌’‌గా సినిమా ఉందని, అలాగే నిర్మాత కాంప్రమైజ్ అవ్వకుండా డబ్బులు ఖర్చు పెట్టారని, డైరెక్టర్ అనిల్ రావిపూడి ఎక్కడా ఎలాంటి బోర్ కొట్టకుండా సినిమా తీశారని పేర్కొన్నారు.

మహేష్ బాబు హీరోగా.. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ అండ్ ఎంటర్‌టైనర్‌‌గా తెరకెక్కిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ చిత్రంతోనే లేడీ అమితాబచ్చన్ విజయశాంతి రీఎంట్రీ ఇచ్చారు. కాగా.. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద దుమ్ము లేపి, కలెక్షన్ల వర్షం కురిపించిన విషయం విదితమే. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించగా, రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, సంగీత, రావు రమేష్ తదితరులు పలు పాత్రల్లో నటించి మెప్పించారు.