Viral Video: మందుబాబులకు ఆగ్రహం తెప్పించిన కుదురులేని కుక్క.. ఫన్నీ వీడియో వైరల్..
Viral Video: ప్రతిరోజూ మనం సోషల్ మీడియాలో రకరకాల వైరల్ వీడియోలు చూస్తున్నాం. వాటిలో జంతువులు చేసే చిలిపి చేష్టలకు సంబంధించిన వీడియోలను నెటిజన్లను..
Viral Video: ప్రతిరోజూ మనం సోషల్ మీడియాలో రకరకాల వైరల్ వీడియోలు చూస్తున్నాం. వాటిలో జంతువులు చేసే చిలిపి చేష్టలకు సంబంధించిన వీడియోలను నెటిజన్లను అమితంగా ఆకర్షిస్తున్నాయి. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక కుక్క చేసిన పనికి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ఇంతకీ ఆ కుక్క ఏం చేసిందో చూస్తే మీరు కూడా నవ్వకుండా ఉండలేరు..
జర్మన్ షెపర్ట్ జాతికి చెందిన ఓ కుక్క చేసిన పని మందుబాబులకు ఆగ్రహం తెప్పిస్తోంది. ఆ కుక్క ఎక్కడి నుంచో ఓ పొడవాటి కర్రను నోట కరచుకొని ఇంట్లోకి వచ్చింది. ఎంట్రీ డోర్‌ని తీసి మరీ లోపలికి వచ్చిన ఆ కుక్క వెంటనే కొంపలు మునిగినట్లు పరుగులు పెట్టింది. పొడవైన కర్రతో ఇంట్లోకి వెళ్తున్నప్పుడు అక్కడే ఓ షెల్ఫులో ఉన్న మద్యం బాటిళ్లు, ఇంకా ఇతర సామగ్రికి తగిలింది. దాంతో మద్యం బాటిళ్లతో సహా వస్తువులన్నీ కింద పడిపోయాయి. దాంతో పెద్ద శబ్దం వచ్చింది. అదిరిపడిన కుక్క… “నాకేం తెలీదు నాయనో” అన్నట్లుగా భయపడుతూ… కర్రను అక్కడే వదిలేసి పరుగు లంకించుకుంది. ఆ తర్వాత మళ్లీ తాపీగా లోపలికి వచ్చింది ఏం జరిగిందో చూద్దాం అన్నట్టుగా.. ఆ కుక్క చేసిన పనికి, మద్యం బాటిళ్లకు కర్ర తగిలినప్పుడు అది పడిన కంగారు చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. Animal Lovers అకౌంట్‌లో షేర్ చేసిన ఈ వీడియోను లక్షలమంది నెటిజన్తు వీక్షిస్తున్నారు. “గర్వంగా లోపలికి వెళ్లింది… షేమ్ అవుతూ బయటకు వచ్చింది” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: అప్పుపై అభిమానంతో.. ఓ అభిమాని నివాళులర్పిస్తూ.. తిరుమల కొండకు పాదయాత్ర