ముంబైలో కుప్పకూలిన భవనం.. శిథిలాల కింద చిక్కుకున్న 51 మంది

ముంబైలో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పాతబస్తీలాంటి డొంగ్రీ ప్రాంతంలో పురాతన కాలం నాటి నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రాంతంలో ఇలాంటి భవనాలు ఇంకా చాలా ఉన్నాయి. వీటిలో నిత్యం ట్రేడింగ్ జరుగుతూ ఉంటుందని స్థానికులు తెలిపారు. బిల్డింగ్ కూలిన ఘటనలో దాదాపు 51 మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్‌ఎఫ్, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిన్నారులు, మహిళలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. బిల్డింగ్ ఫిట్‌నెస్ తగ్గిపోవడంతో […]

ముంబైలో కుప్పకూలిన భవనం.. శిథిలాల కింద చిక్కుకున్న 51 మంది
Follow us

| Edited By:

Updated on: Jul 16, 2019 | 6:58 PM

ముంబైలో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పాతబస్తీలాంటి డొంగ్రీ ప్రాంతంలో పురాతన కాలం నాటి నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రాంతంలో ఇలాంటి భవనాలు ఇంకా చాలా ఉన్నాయి. వీటిలో నిత్యం ట్రేడింగ్ జరుగుతూ ఉంటుందని స్థానికులు తెలిపారు. బిల్డింగ్ కూలిన ఘటనలో దాదాపు 51 మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్‌ఎఫ్, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిన్నారులు, మహిళలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. బిల్డింగ్ ఫిట్‌నెస్ తగ్గిపోవడంతో పాటు ఇటీవల ముంబైలో భారీగా కురిసిన వర్షాలు కూడా దీనికి కారణమే అని తెలుస్తోంది. బృహన్ ముంబై మున్సిపాలిటీ కార్పొరేషన్ హెచ్చరికలు జారీ చేసినా.. ప్రజలు అక్కడి నుంచి ఖాళీ చేయలేదని తెలుస్తోంది. అయితే ముంబై మున్సిపల్ అధికారులు తమకు సరైన ప్రత్యామ్నాయం చూపించలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డొంగ్రీ ఏరియాలో దాదాపు 200 వందల నుంచి 300 వందల వరకు ఇలాంటి ఫిట్‌నెస్ లేని ఇళ్లు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

ఈ ఘటనలో 12 మంది మరణించారు. ఈ నాలుగంతస్తుల భవనం శిథిలాల కింద మరో 30 మంది చిక్కుకుపోయినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ భవనం దాదాపు 8 దశాబ్దాల నాటిది. గత ఏడేళ్లుగా ఈ భవనం ఓ ప్రయివేటు బిల్డర్ చేతిలో ఉంది.

Latest Articles
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో..
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో..
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..