హైకోర్టును ఆశ్రయించిన బిగ్‌బాస్ టీం..!

మా టీవీ బిగ్‌బాస్ కో ఆర్డినేషన్ టీం హైకోర్టును ఆశ్రయించింది. తమపై దాఖలైన ఫిర్యాదులను కొట్టివేయాలని కోరుతూ.. హైకోర్టులో ఈ టీం క్వాష్ పిటిషన్ దాఖలు చేసింది. బంజారాహిల్స్, రాయదుర్గం పీఎస్‌లలో నమోదైన కేసులను కొట్టివేయాలని షో నిర్వాహకులు ఈ పిటిషన్‌లో కోరారు. గత కొద్ది రోజులుగా బిగ్‌బాస్-3 పై చాలా రభస జరుగుతోంది. మొదట యాంకర్ శ్వేతారెడ్డి బంజారాహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు చేయగా, అనంతరం నటి గాయత్రీ గుప్తా కూడా రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు […]

హైకోర్టును ఆశ్రయించిన బిగ్‌బాస్ టీం..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 16, 2019 | 1:32 PM

మా టీవీ బిగ్‌బాస్ కో ఆర్డినేషన్ టీం హైకోర్టును ఆశ్రయించింది. తమపై దాఖలైన ఫిర్యాదులను కొట్టివేయాలని కోరుతూ.. హైకోర్టులో ఈ టీం క్వాష్ పిటిషన్ దాఖలు చేసింది. బంజారాహిల్స్, రాయదుర్గం పీఎస్‌లలో నమోదైన కేసులను కొట్టివేయాలని షో నిర్వాహకులు ఈ పిటిషన్‌లో కోరారు.

గత కొద్ది రోజులుగా బిగ్‌బాస్-3 పై చాలా రభస జరుగుతోంది. మొదట యాంకర్ శ్వేతారెడ్డి బంజారాహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు చేయగా, అనంతరం నటి గాయత్రీ గుప్తా కూడా రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తమ పట్ల బిగ్‌బాస్ షో నిర్వాహకులు అసభ్యంగా వ్యవహరించారంటూ వేరువేరుగా వీరు ఫిర్యాదు చేశారు. దీంతో.. బంజారాహిల్స్ పీఎస్‌లో నలుగురు బిగ్ బాస్ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులను కొట్టివేయాల్సిందిగా హైకోర్టులో పిటిషన్ వేశారు బిగ్ బాస్ నిర్వాహకులు.