AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పుల్వామా ఎన్‌కౌంటర్‌లో నలుగురు లష్కరే ఉగ్రవాదులు హతం

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత చర్యలు మరింత ముమ్మరంగా సాగుతున్నాయి. పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య సోమవారం తెల్లవారుజామున ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో నలుగురు లష్కరే తొయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. లాసీపొర ప్రాంతంలో ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న నిఘా వర్గాల సమాచారంతో ఇండియన్ ఆర్మీ, సీఆర్పీఎఫ్ జవాన్లు, కశ్మీర్ పోలీసులు అక్కడకు సోమవారం తెల్లవారుజామున చేరుకున్నారు. ఇండియన్ ఆర్మీ 44 రాష్ట్రీయ రైఫిల్స్, సీఆర్పీఎఫ్, స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ సంయుక్తంగా లాసీపొరలో నిర్భంద తనిఖీలు […]

పుల్వామా ఎన్‌కౌంటర్‌లో నలుగురు లష్కరే ఉగ్రవాదులు హతం
TV9 Telugu Digital Desk
|

Updated on: Apr 01, 2019 | 10:53 AM

Share

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత చర్యలు మరింత ముమ్మరంగా సాగుతున్నాయి. పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య సోమవారం తెల్లవారుజామున ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో నలుగురు లష్కరే తొయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. లాసీపొర ప్రాంతంలో ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న నిఘా వర్గాల సమాచారంతో ఇండియన్ ఆర్మీ, సీఆర్పీఎఫ్ జవాన్లు, కశ్మీర్ పోలీసులు అక్కడకు సోమవారం తెల్లవారుజామున చేరుకున్నారు. ఇండియన్ ఆర్మీ 44 రాష్ట్రీయ రైఫిల్స్, సీఆర్పీఎఫ్, స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ సంయుక్తంగా లాసీపొరలో నిర్భంద తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలో తీవ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. దీంతో అప్రమత్తమైన సైన్యం ఎదురు కాల్పులు జర‌పడంతో ఎన్‌కౌంటర్‌గా మారింది. ఆ ఉగ్రవాదుల‌ నుంచి రెండు ఏకే రైఫిల్స్‌, ఒక ఎస్‌ఎల్‌ఆర్‌, ఒక తుపాకీని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. వీరిని లష్కరే తొయిబా ఉగ్రవాదులుగా గుర్తించారు. ఇంకా ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.

Follow Us
రైతు భరోసా జారీలో ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికే తొలి ప్రాధాన్యత
రైతు భరోసా జారీలో ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికే తొలి ప్రాధాన్యత
మీకు చేతులెలా వచ్చాయి..? అమ్మ ఒడిలో కాదు.. ముళ్లపొదల్లో కనిపించిన
మీకు చేతులెలా వచ్చాయి..? అమ్మ ఒడిలో కాదు.. ముళ్లపొదల్లో కనిపించిన
సూర్య 50వ సినిమాపై ఇండస్ట్రీలో ఇంట్రస్టింగ్ బజ్
సూర్య 50వ సినిమాపై ఇండస్ట్రీలో ఇంట్రస్టింగ్ బజ్
పిల్లల లంచ్ బాక్స్‌లోకి బెస్ట్.. ప్రోటీన్ దోశ ఎలా చేయాలంటే?
పిల్లల లంచ్ బాక్స్‌లోకి బెస్ట్.. ప్రోటీన్ దోశ ఎలా చేయాలంటే?
భారీగా కుప్పకూలిన బంగారం ధరలు.. ఒక్కరోజులోనే క్రాష్..
భారీగా కుప్పకూలిన బంగారం ధరలు.. ఒక్కరోజులోనే క్రాష్..
హిందువులు జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సిన నైమిశారణ్యం.. పురాణాల
హిందువులు జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సిన నైమిశారణ్యం.. పురాణాల
హైదరాబాద్‌- ముంబై బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో కీలక మార్పులు
హైదరాబాద్‌- ముంబై బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో కీలక మార్పులు
ఓటీటీలోకి రామ్ చరణ్ 'పెద్ది'! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి రామ్ చరణ్ 'పెద్ది'! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నిద్రలో గుండెపై దెయ్యం కూర్చున్నట్లు ఎందుకు అనిపిస్తుంది..?
నిద్రలో గుండెపై దెయ్యం కూర్చున్నట్లు ఎందుకు అనిపిస్తుంది..?
ఆ జబర్దస్త్ నటుడు నన్ను దారుణంగా మోసం చేశాడు..
ఆ జబర్దస్త్ నటుడు నన్ను దారుణంగా మోసం చేశాడు..