ఆ నాలుగు జిల్లాలను వదలొద్దు.. జగన్ ఆదేశం

ఏపీలోని ఆ నాలుగు జిల్లాలను వదలొద్దంటూ ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ప్రత్యేకంగా దృష్టి సారించడం ద్వారా కరోనా నియంత్రణకు చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.

ఆ నాలుగు జిల్లాలను వదలొద్దు.. జగన్ ఆదేశం
Rajesh Sharma

|

Apr 21, 2020 | 2:08 PM

ఏపీలోని ఆ నాలుగు జిల్లాలను వదలొద్దంటూ ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ప్రత్యేకంగా దృష్టి సారించడం ద్వారా కరోనా నియంత్రణకు చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్ నివారణ చర్యలపై ముఖ్యమంత్రి మంగళవారం నాడు అత్యున్నత స్థాయి సమీక్ష జరిపారు. కర్నూలు, గుంటూరు, నెల్లూరు, కృష్ణా జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఆయన నిర్దేశించారు. ఈ నాలుగు జిల్లాల్లో మరింత పెద్ద సంఖ్యలో కరోనా పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం వుందని ముఖ్యమంత్రి తెలిపారు.

ఈ సమీక్షలో అధికారుల నుంచి గ్రౌండ్ లెవల్ పరిస్థితిని తెలుసుకున్నారు ముఖ్యమంత్రి జగన్. మాస్క్‌ల పంపిణీ ఊపందుకుందని తెలిపిన అధికారులు.. మాస్క్‌లను రెడ్, ఆరెంజ్‌ జోన్లకు ముందు పంపిణీ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో టెస్టులు బాగా జరుగుతున్నాయని, విశాఖపట్నంలో టెస్టులు బాగా జరుగుతున్నాయని అధికారులు వివరించారు. విజయనగరం, శ్రీకాకుళంజిల్లాలో కేసులు ఒక్కటి కూడా నమోదుకాలేదన్నారు. ట్రూనాట్‌ కిట్స్‌ ద్వారా పరీక్షలకు ఏర్పాట్లు చేశామని వివరించారు. 225 ట్రూనాట్‌ కిట్స్‌తో విస్తారంగా పరీక్షలు అందుబాటులోకి వచ్చాయన్న, సోమవారం (ఏప్రిల్ 20వ తేదీ) ఒక్కరోజే రాష్ట్రంలో 5022 కోవిడ్‌ –19 పరీక్షలు జరిపామని తెలిపారు.

తాజా కర్నూలు జీజీహెచ్‌ను కోవిడ్‌ ఆస్పత్రిగా మార్చాలని నిర్ణయించామన్నారు. ప్రైవేటు ఆసుపత్రి, కాలేజీల యాజమాన్యాలు సహకరించకపోవడంతో అక్కడ చికిత్స పొందుతున్న వారందరినీ కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించామని తెలిపారు. పీపీఈలను, మాస్క్‌లనుకూడా అవసరాలకు అనుగుణంగా ఉంచుతున్నామన్న అధికారులు.. పాజిటివ్ కేసులు ఎక్కువ ఉన్నచోట స్టాక్‌ను అధికంగా ఉంచుతున్నామన్నారు. సమగ్ర సర్వే ద్వారా గుర్తించిన 32 వేలమందిలో ఇప్పటికే 2వేలకుపైగా పరీక్షలు చేశామని, మిగిలిన వారికి కూడా పరీక్షలు నిర్వహిస్తామన్నారు. క్వారంటైన్‌ సెంటర్లలో ఇప్పటివరకూ 7100 మంది ఉన్నారన్నారు.

అనంతరం రాష్ట్రంలో రబీ పంట దిగుబడులు, రైతాంగం పరిస్థితిని ముఖ్యమంత్రి సమీక్షించారు. పంటలకు సంబంధించి ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు సీఎం. దూకుడుగా కొనుగోళ్లు జరపాలని, రైతులకు అండగా నిలబడాలని సీఎం సూచించారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu