బాబుకు బ్యాడ్ డేస్..వైసీపీ గూటికి మాజీ మంత్రి..?

పార్టీ పెట్టినప్పటి నుంచి ఇంత దారుణ పరిస్థితి టీడీపీకి ఎప్పుడూ లేదేమో అనిపిస్తోంది. ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం వరస పెట్టి నాయకులు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు.  మరోవైపు జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటన విషయంలో అధిష్టానం స్టాండ్‌కు వ్యతిరేకంగా  టీడీపీలో భిన్న వాయిస్‌లు వినిపిస్తున్నాయి. క్యాపిటల్ విషయాన్ని షాకుగా చూపించి ఓ మాజీ మంత్రి పార్టీకి టాటా చెప్పబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఉత్తరాంధ్రలో సీనియర్ నేతగా పేరు తెచ్చకున్న కొండ్రు మురళి, వైసీపీ […]

బాబుకు బ్యాడ్ డేస్..వైసీపీ గూటికి మాజీ మంత్రి..?
Follow us

|

Updated on: Dec 23, 2019 | 1:38 PM

పార్టీ పెట్టినప్పటి నుంచి ఇంత దారుణ పరిస్థితి టీడీపీకి ఎప్పుడూ లేదేమో అనిపిస్తోంది. ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం వరస పెట్టి నాయకులు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు.  మరోవైపు జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటన విషయంలో అధిష్టానం స్టాండ్‌కు వ్యతిరేకంగా  టీడీపీలో భిన్న వాయిస్‌లు వినిపిస్తున్నాయి. క్యాపిటల్ విషయాన్ని షాకుగా చూపించి ఓ మాజీ మంత్రి పార్టీకి టాటా చెప్పబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.

ఉత్తరాంధ్రలో సీనియర్ నేతగా పేరు తెచ్చకున్న కొండ్రు మురళి, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో పార్టీలో చేరేందుకు చర్చలు జరుపుతున్నారని విశ్వసనీయ సమాచారం. విశాఖలో ఎగ్జిక్యూటీవ్ రాజధాని ప్రకటన చేసిన వెంటనే, కొండ్రు మురళి సంపూర్ణ మద్దతు తెలిపారు. ఆయనతో పాటు భారీ స్థాయిలో ద్వితీయ శ్రేణి నాయకులు వైసీపీ కండువా కప్పుకోడానికి సిద్దమైనట్టు సమాచారం.  కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్‌లో వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేసిన కొండ్రు మురళికి రాష్ట్ర రాజకియాల్లో మంచి పట్టు ఉంది. ఆయన జంప్ అయితే, ఉత్తరాంధ్రలో టీడీపీకి భారీగా డ్యామేజ్ ఖాయంగా కనిపిస్తోంది.