AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆంధ్రా బిత్తిరి సత్తి తమ్మినేని.. కూన ఎంత మాటనేశారు!

ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారామ్‌పై మండి పడ్డారు మాజీ ప్రభుత్వ విప్, తెలుగుదేశం నేత కూన రవికుమార్. సొంత ఊరికి కనీసం రహదారి, మౌలిక సదుపాయాలు కల్పించలేని తమ్మినేని అమరావతి రాజధానిని ఎడారితో పోల్చడం సిగ్గు చేటంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు కూన. స్పీకర్ స్ధానంలో వుంటూ ఆంధ్రా బిత్తర సత్తిలా తమ్మినేని వ్యవహరిస్తున్నారని విమర్శించారాయన. మరోసారి తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును, అమరావతి రాజధాని విషయంలోను తమ్మినేని అనుచిత వ్యాఖ్యలు చేస్తే గుడ్డలు […]

ఆంధ్రా బిత్తిరి సత్తి తమ్మినేని.. కూన ఎంత మాటనేశారు!
Rajesh Sharma
|

Updated on: Dec 23, 2019 | 1:42 PM

Share

ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారామ్‌పై మండి పడ్డారు మాజీ ప్రభుత్వ విప్, తెలుగుదేశం నేత కూన రవికుమార్. సొంత ఊరికి కనీసం రహదారి, మౌలిక సదుపాయాలు కల్పించలేని తమ్మినేని అమరావతి రాజధానిని ఎడారితో పోల్చడం సిగ్గు చేటంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు కూన. స్పీకర్ స్ధానంలో వుంటూ ఆంధ్రా బిత్తర సత్తిలా తమ్మినేని వ్యవహరిస్తున్నారని విమర్శించారాయన. మరోసారి తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును, అమరావతి రాజధాని విషయంలోను తమ్మినేని అనుచిత వ్యాఖ్యలు చేస్తే గుడ్డలు ఊడదీసి కొడతానని హెచ్చరించారు.

తన భార్య, కొడుకు కలిసి జిల్లాలో అక్రమ ఇసుక దందా చేస్తుంటే అడగలేని చేతగాని భర్త, తండ్రి లా వ్యవహరిస్తున్న తమ్మినేని ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని కూన రవి వార్నింగ్ ఇచ్చారు. తన స్ధాయి మరచి ఐదు కోట్ల ఆంధ్రుల మనోభావాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్న స్పీకర్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఇటువంటి స్పీకర్ రాష్ట్రానికి వుండటం రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టకరమని కూన వ్యాఖ్యానించారు. తమ్మినేని వంటి వ్యక్తి స్పీకర్ స్ధానంలో వుండటం శాసన వ్యవస్థకే మాయని మచ్చని కామెంట్ చేశారు. శాసనసభ సిగ్గు పడేలా వ్యవహరించిన స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

సాక్షాత్తూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగి, ముప్పై వేల ఎకరాల భూమిని రైతులు స్వచ్చందంగా ముందుకు వచ్చి ఇచ్చిన ఏపీ రాజధాని అమరావతిని ఎడారితో పోలచటం తమ్మినేని దిగజారుడు తనానికి నిదర్శనమని కూన రవి విమర్శించారు. కూన రవి ఘాటైన వ్యాఖ్యలపై స్పీకర్ తమ్మినేని ఏ విదంగా రెస్పాండ్ అవుతారో అని చర్చించకుంటున్నారు సిక్కోలు జనం.