రాయలసీమకు జగన్ తీరని ద్రోహం.. ‘కాలువ‘ మాటేంటంటే?

రెండు బెంచ్‌లను అమరావతి, విశాఖల్లో ఏర్పాటు చేసి అవశేష హైకోర్టును కర్నూలుకు ఇస్తున్నారంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత కాలువ శ్రీనివాసులు. రాయలసీమ వాసి అయిన జగన్ ఈ ప్రాంత వాసులను విస్మరిస్తున్నారని అన్నారాయన. స్వార్థ ప్రయోజనాల కోసం సీమ వాసులకు ముఖ్యమంత్రి ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. రాయలసీమ ద్రోహిగా జగన్ మిగిలిపోతారని, దీనిపై వైసీపీ సీమ నేతలు స్పందించాలని కాలువ డిమాండ్ చేశారు. […]

రాయలసీమకు జగన్ తీరని ద్రోహం.. ‘కాలువ‘ మాటేంటంటే?
Follow us
Rajesh Sharma

|

Updated on: Dec 23, 2019 | 2:33 PM

రెండు బెంచ్‌లను అమరావతి, విశాఖల్లో ఏర్పాటు చేసి అవశేష హైకోర్టును కర్నూలుకు ఇస్తున్నారంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత కాలువ శ్రీనివాసులు. రాయలసీమ వాసి అయిన జగన్ ఈ ప్రాంత వాసులను విస్మరిస్తున్నారని అన్నారాయన. స్వార్థ ప్రయోజనాల కోసం సీమ వాసులకు ముఖ్యమంత్రి ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు.

రాయలసీమ ద్రోహిగా జగన్ మిగిలిపోతారని, దీనిపై వైసీపీ సీమ నేతలు స్పందించాలని కాలువ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మూడు ముక్కలు చేసిన ఏపీ హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయడం వలన సీమ వాసులకు ఒరిగే ప్రయోజనం ఏంటని ఆయన ప్రశ్నించారు. అవశేష హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయడం వలన ఎంత మంది సీమవాసులకు ఉద్యోగాలు వస్తాయని అడిగారు కాలువ. విశాఖపట్నం రాయలసీమ వాసులకు చాలా దూరంలో ఉందని అన్నారాయన.

అమరావతే దూరం అనుకుంటే అంత కంటే దూరంలోని వున్న విశాఖలో రాజధాని పెడతామంటున్నారని అన్నారు కాలువ శ్రీనివాసులు. సామాన్య ప్రజలు అంత దూరం ఎలా వెళతారని ప్రభుత్వాన్ని నిలదీశారు. విశాఖపట్నం వాసులు కూడా ఇక్కడ ఏం చేస్తారోనని భయపడుతున్నారని, మూడు రాజధానులన్నది ప్రగతి నిరోధక చర్య అని కాలువ అంటున్నారు. సీఎం జగన్ అనాలోచితంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని, గతంలో అమరావతి రాజధానికి విపక్ష నేతగా జగన్ అసెంబ్లీలోనే ఒకే చెప్పారని కాలువ కామెంట్ చేశారు.

రాజధాని నిర్మాణానికి కనీసం 30వేల ఎకరాలు అవసరం అన్న జగన్ ఇప్పుడు జీఎన్ రావు కమిటీ ద్వారా ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాజధానిలో భవనాలు శాశ్వతం అన్నది మరచి పోవద్దని సూచిస్తున్న కాలువ శ్రీనివాసులు… మే 27న జరిగే కేబినెట్ భేటీలో అయినా రాజధానిపై ఏర్పడిన గందరగోళానికి తెరదించాలని డిమాండ్ చేశారు.