దారుణం.. అత్యాచార బాధితురాలు పోలీస్ స్టేషన్ మెట్లెక్కితే..
మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు నిర్లక్ష్యం ఓ అత్యాచార బాధితురాలి ప్రాణాలు కోల్పోయేలా చేసింది. తనపై అత్యాచారం జరిగిందంటూ కంప్లైంట్ ఇచ్చేందుకు పోలీస్ స్టేషన్‌కి వస్తే.. పోలీసులు కేసును స్వీకరించడలేదు. దీంతో ఆ బాధితురాలు ఆత్మహత్యకు పాల్పడింది. రాష్ట్రంలోని కర్గోనే జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. జిల్లా అడిషనల్ ఎస్పీ శశికాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 16వ తేదీన పదహారేళ్ల ఓ బాలిక కర్గోనే జిల్లా కేంద్రం నుంచి తన సొంత గ్రామానికి […]
మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు నిర్లక్ష్యం ఓ అత్యాచార బాధితురాలి ప్రాణాలు కోల్పోయేలా చేసింది. తనపై అత్యాచారం జరిగిందంటూ కంప్లైంట్ ఇచ్చేందుకు పోలీస్ స్టేషన్‌కి వస్తే.. పోలీసులు కేసును స్వీకరించడలేదు. దీంతో ఆ బాధితురాలు ఆత్మహత్యకు పాల్పడింది. రాష్ట్రంలోని కర్గోనే జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
జిల్లా అడిషనల్ ఎస్పీ శశికాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 16వ తేదీన పదహారేళ్ల ఓ బాలిక కర్గోనే జిల్లా కేంద్రం నుంచి తన సొంత గ్రామానికి తిరుగు ప్రయాణమైంది. ఈ క్రమంలో ఆశాపూర్ గ్రామానికి చెందిన సుఖ్‌రాం బుందేలా అనే వ్యక్తి.. కిడ్నాప్ చేసి.. అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఆ బాలిక ఆరోపించింది. అనంతరం సదరు యువతి ఇంట్లో పురుగుల మందు తాగి సూసైడ్‌కు యత్నించింది. దీంతో వెంటనే కుటుంబీకులు ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలువిడిచింది. బాలిక వాగ్మూలం ప్రకారం.. నిందితుడు సుఖ్‌రాంని అరెస్టు చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఏఎస్పీ శశికాంత్ తెలిపారు.
కాగా, ఈ ఘటనపై బాధితురాలి తండ్రి మాత్రం పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ మెట్లెక్కితే.. ఫిర్యాదు తీసుకునేందుకు తిరస్కరించారని.. రెండూ మూడు సార్లు వెళ్లినా కూడా పట్టించుకోకుండా.. తన కూతురిపై అసభ్యకర కామెంట్స్ చేశారని ఆరోపించారు. పోలీసుల చర్యలతో మనస్థాపానికి గురైన తన కూతురు ఆత్మహత్యకు పాల్పడిందంటూ వాపోయారు. దీనిపై స్పందించిన జిల్లా ఎస్పీ.. ఘటనపై పూర్తి దర్యాప్తు చేపడతామన్నారు.