రాజధాని భూములపై పోరాటం ఉధృతం : చంద్రబాబు
రాజధానిపై పోరాటం ఉధృతం చేసేందుకు టీడీపీ సిద్ధమవుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఆపార్టీ ముఖ్యనేతలతో సోమవారం సమావేశమై పలు విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలిసి వచ్చే పార్టీలతో రాజధాని భూముల అంశంపై పోరాటం చేద్దామన్నారు. త్వరలోనే ఒక కమిటీ రూపొందించి అంశాల వారీగా ప్రభుత్వంపై ప్రశ్నిద్దామన్నారు. హైదరాబాద్ గ్రౌండ్ ఫీల్డ్ అయితే అమరావతి గ్రీన్ ఫీల్డ్ అవుతుందన్నారు. రాజధాని కోసం ఎంతో మంది రైతులు తమ సొంత భూముల్ని ఇచ్చారని .. ఎంత […]
రాజధానిపై పోరాటం ఉధృతం చేసేందుకు టీడీపీ సిద్ధమవుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఆపార్టీ ముఖ్యనేతలతో సోమవారం సమావేశమై పలు విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలిసి వచ్చే పార్టీలతో రాజధాని భూముల అంశంపై పోరాటం చేద్దామన్నారు. త్వరలోనే ఒక కమిటీ రూపొందించి అంశాల వారీగా ప్రభుత్వంపై ప్రశ్నిద్దామన్నారు. హైదరాబాద్ గ్రౌండ్ ఫీల్డ్ అయితే అమరావతి గ్రీన్ ఫీల్డ్ అవుతుందన్నారు. రాజధాని కోసం ఎంతో మంది రైతులు తమ సొంత భూముల్ని ఇచ్చారని .. ఎంత వెదికినా అవినీతి కనిపించదన్నారు చంద్రబాబు. అధికారం చేపట్టిన 100 రోజులు పూర్తి చేసుకున్న వైసీపీ పాలనపై ఓ పుస్తకం విడుదల చేస్తామని చంద్రబాబు చెప్పారు. త్వరలో అన్ని జిల్లాల్లోనూ పర్యటిస్తానని ఆయన తెలిపారు.