పోలీసులు రిటైరైనా వదిలిపెట్టే ప్రసక్తేలేదు: చంద్రబాబు

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు పోలీసులపై సంచలన కామెంట్స్ చేశారు. అనంతపురంలో రెండో రోజు పర్యటనలో భాగంగా.. గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ నేతలపై దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. దాడులు చాలా నీచమని, దారుణమని వ్యాఖ్యానించారు. వైసీపీ ఉండకూడదని తాను అనుకుంటే.. ఒక్కరు కూడా ఉండరని.. అది గుర్తుపెట్టుకోవాలని అన్నారు. అలాగే.. మరోసారి పోలీసులను హెచ్చరించారు చంద్రబాబు. పోలీసులు ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారని.. ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తే మిమ్మల్ని వదిలి పెట్టనని ఘాటుగా కామెంట్స్ […]

పోలీసులు రిటైరైనా వదిలిపెట్టే ప్రసక్తేలేదు: చంద్రబాబు
Follow us

| Edited By:

Updated on: Dec 19, 2019 | 2:33 PM

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు పోలీసులపై సంచలన కామెంట్స్ చేశారు. అనంతపురంలో రెండో రోజు పర్యటనలో భాగంగా.. గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ నేతలపై దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. దాడులు చాలా నీచమని, దారుణమని వ్యాఖ్యానించారు. వైసీపీ ఉండకూడదని తాను అనుకుంటే.. ఒక్కరు కూడా ఉండరని.. అది గుర్తుపెట్టుకోవాలని అన్నారు. అలాగే.. మరోసారి పోలీసులను హెచ్చరించారు చంద్రబాబు. పోలీసులు ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారని.. ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తే మిమ్మల్ని వదిలి పెట్టనని ఘాటుగా కామెంట్స్ చేశారు. పోలీసులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని.. రిటైర్‌ అయినా.. కోట్లు ఖర్చు పెట్టి మరీ ప్రైవేట్ కేసులు వేస్తానని అన్నారు. టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని.. దీనికి తగిన మూల్యం చెల్లిస్తారని వ్యాఖ్యానించారు. కాగా.. వైసీపీ ప్రభుత్వం ధైర్యముంటే పోలీసులను పక్కన పెట్టి రండి.. మీరో మేమో చూసుకుందాం.. ఎక్కడికి రావాలో చెప్పండి మేం సిద్ధమంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు టీడీపీ అధినేత చంద్రబాబు.